Mahabubabad: విషాదంగా ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ.. కాపురం విడగొట్టారని!

మహబూబాబాద్ లో ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ విషాదాంతమైంది. ఇన్ స్టాగ్రామ్ పరిచయం ప్రేమ, పెళ్లి, కాపురం వరకూ వెళ్లగా వారిని పేరెంట్స్ బలవంతంగా విడదీశారు. దీంతో ఎలుకల మందు తాగి ఒకరు చనిపోగా మరొకరు చికిత్స పొందుతున్నారు. వారు లెస్బీయన్స్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
Mahabubabad: విషాదంగా ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ.. కాపురం విడగొట్టారని!

Crime: తెలంగాణలో ఇటీవల చర్చనీయాంశమైన ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ చివరికి విషాదాంతమైంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన 21 ఏళ్ల యువతికి, గార్ల మండలానికి చెందిన 20ఏళ్ల యువతి ఆరు నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమలోపడ్డారు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకుని కాపురం కూడా పెట్టారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. విషయం బటయకు రావడంతో అసలు కథ మొదలైంది.

పరువు పోతుందని భావించి..
ఈ ఇద్దరు అమ్మాయిలు వ్యవహారం రెండువైపులా తల్లిదండ్రులకు తెలిసిపోయింది. ఊర్లో వాళ్లకు తెలిస్తే పరువు పోతుందని భావించిన పేరెంట్స్ వాళ్లను విడదీసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కొంతకాలం ఇద్దరినీ ఎవరింటికి వారిని తీసుకెళ్లిపోయారు. కానీ మే చివరి వారంలో ఈ ఇద్దరూ విజయవాడ పారిపోయారు. దాంతో కురివి మండలానికి చెందిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఎంక్వైరీ చేసి ఇద్దరు అమ్మాయిలనూ స్వస్థలాలకు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు.

వీరిద్దరూ లెస్బియన్స్ కావచ్చనే అనుమానాలు..
అయితే ఈ సంఘటనతో తీవ్ర ఒత్తిడికి లోనైన యువతులు జూన్ 1న మహబూబాబాద్‌లో ఎలుకల మందు తాగారు. అయితే స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారిని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కురవి మండలానికి చెందిన యువతి శుక్రవారం చనిపోయింది. మరో యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ లెస్బియన్స్ కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

#two-girls #mahabubabad #love-story
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. ష...

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment