ఇష్టం లేని పెళ్లి చేస్తారనే భయంతో ప్రాణాలు తీసుకుంది..ఏపీలో విషాద ఘటన!

ఇంట్లో వారు ఎలాగైన పెళ్లి చేస్తారనే భయంతో నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని సూసైడ్‌ నోటు రాసి అపార్ట్ మెంట్‌ లోని ఏడవ అంతస్తు పై నుంచి దూకి గౌరీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది

New Update
ఇష్టం లేని పెళ్లి చేస్తారనే భయంతో ప్రాణాలు తీసుకుంది..ఏపీలో విషాద ఘటన!

ఇంట్లో వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేస్తారనే భయంతో ఓ యువతి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జిల్లాలోని గోకులంలోని సాయి శ్రీనివాస అపార్ట్‌ మెంట్లో గౌరీ అనే యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది.

గౌరీ ప్రస్తుతం డిగ్రీ చదువుతుంది. ఈ క్రమంలోనే ఇంట్లో వారు ఆమెకి పెళ్లి చేయాలని నిశ్చయించారు. అందుకుగానూ ఆమెకు గురువారం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అబ్బాయి తరుఫున వారు గౌరీ చూసుకుని వెళ్లారు. అయితే అప్పుడే పెళ్లి చేసుకోవడం గౌరీకి ఇష్టం లేదు. ఈ విషయం గురించి ఇంట్లో చెబితే ఏమాంటారో అని భయపడింది.

ఇంట్లో వారు ఎలాగైన పెళ్లి చేస్తారనే భయంతో నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని సూసైడ్‌ నోటు రాసి అపార్ట్ మెంట్‌ లోని ఏడవ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన గౌరీని సత్యసాయి జనరల్‌ హాస్పిటల్‌ కి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.

కాగా యువతి అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు సీసీటీవీ కెమారాలో రికార్డ్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పుట్టపర్తి అర్బన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read: మూడు సార్లు చనిపోదాం అనుకున్నాడు.. కట్ చేస్తే ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment