Sai Pallavi Birthday Special : సాయి పల్లవికి 'తండేల్' టీమ్ బర్త్ డే గిఫ్ట్.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!

గురువారం సాయి పల్లవి పుట్టిన రోజు కావడంతో 'తండేల్' మూవీ నుంచి ఆమె మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి పల్లవి గురించి గొప్పగా చెబుతూ, తన ఫెర్ఫార్మెన్స్ , షూటింగ్ సెట్స్ లో తను చేసే అల్లరి, ఆమె చేసే మంచి పనులను చూపించారు.

New Update
Sai Pallavi Birthday Special : సాయి పల్లవికి 'తండేల్' టీమ్ బర్త్ డే గిఫ్ట్.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!

Sai Pallavi Making Video From Thandel : న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి లాంగ్ గ్యాప్ తర్వాత నాగ చైతన్యతో కలిసి ' తండేల్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. గీతా ఆర్ట్స్ (Geetha Arts) నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. ఇక నేడు (గురువారం) సాయి పల్లవి పుట్టిన రోజు (Sai Pallavi Birthday) కావడంతో 'తండేల్' మూవీ నుంచి ఆమె మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో

సాయి పల్లవికి బర్త్ డే విషెష్ చెబుతూ 'తండేల్' మూవీ టీమ్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో సాయి పల్లవి గురించి గొప్పగా చెబుతూ, తన ఫెర్ఫార్మెన్స్ , షూటింగ్ సెట్స్ లో తను చేసే అల్లరి, ఆమె చేసే మంచి పనులను చూపించారు.

Also Read : 54 ఏళ్ల వయసులో గ్లామర్ తో అలరిస్తున్న హాలీవుడ్ నటి..

ఇక వీడియో చివర్లో నాగ చైతన్యకి అన్నం తినిపిస్తుంటే ఇక చాలు, ఇంకా ఎంత తినిపిస్తావ్ అని చైతు చెబుతుంటే.. దానికి సాయి పల్లవి నవ్వుతూ ఇచ్చిన రియాక్షన్ హైలైట్ గా మారింది. ఇక ఈ క్యూట్ వీడియోని చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ సాయి పల్లవి సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

స్పెషల్ పోస్టర్ కూడా

'తండేల్' నుంచి సాయి పల్లవి మేకింగ్ వీడియోతో పాటూ ఆమె లుక్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. సముద్ర తీరాన కూర్చుని నవ్వుతూ ఫోన్ మాట్లాడుతున్న సాయి పల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు