Hyderabad: నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి!

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్ అనుకోని సంఘటనతో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ అంజయ్యనగర్‌లోని షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్న యువకుడు అదే హాస్టల్ సంపులో పడి చనిపోయాడు. వీడియో వైరల్ అవుతోంది. హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.

New Update
Hyderabad: నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి!

Software Employee Died After Falling Into Water Sump:  హైదరాబాద్ రాయదుర్గంలో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం ఉన్న ఊరు వదిలి పట్టణానికి వచ్చిన ఓ యువకుడు అనుకోని సంఘటనతో ప్రాణాలు కోల్పోయాడు. అంజయ్యనగర్‌లోని ఓ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గేటు ముందున్న సంపు మూత తెరవడంతో..
ఈ మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్(Shaik Akmal Sufuyan- 24). అయితే రోజువారి కార్యక్రమాల్లో భాగంగానే బజారుకెళ్లిన అక్మల్ అరటిపండ్లు తీసుకుని భవనం లోపలికి వచ్చాడు. అయితే గేటు ముందున్న సంపు మూత తెరిచివుంచడం గమనించకుండానే ముందుకు నడిచాడు. దీంతో ఒక్కసారిగా సంపులో పడిపోయాడు.

ఇది కూడా చదవండి: Hyderabad: మాధవీలతకు ఆలింగనం.. ఏఎస్సై కి షాక్ ఇచ్చిన సీపీ!

ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో..
ఈ క్రమంలో అక్కడున్న వ్యక్తికి శబ్ధం రావడంతో ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో అటు ఇటు గమనించగా ఎక్కడ ఎవరూ కనిపించలేదు. అరటిపండ్లు సంపు పక్కన ఉండటం గమనించి నీళ్ల సంపు లోపలికి చూడగా అప్పటికే అక్మల్ మరణించినట్లు తెలిపాడు. ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి సీసీ పుటేజీలో క్లియర్ గా రికార్డ్ అయింది. హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు