Uttar Pradesh: ఆలయంలో పూజారి చోరీ.. రూ.కోటి 9 లక్షలతో పరార్

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ముకుట్‌ ముఖారవింద్‌ అనే ఆలయంలో దినేష్ చంద్ అనే పూజారి రూ.కోటి 9 లక్షలు దొంగతనం చేసి పరారయ్యాడు. ఆలయ మేనేజర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Uttar Pradesh: ఆలయంలో పూజారి చోరీ.. రూ.కోటి 9 లక్షలతో పరార్

సాధారణంగా బయట వ్యక్తులు గుడిలో దొంగతనం చేసే ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఓ గుడిలో మాత్రం ఏకంగా పూజారే చోరీకి పాల్పడ్డాడు. 5 వేలు, 10 వేలు కాదు.. ఏకంగా రూ.కోటి 9 లక్షలు దొంతనం చేసి పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఓ ఆలయంలో ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముకుట్‌ ముఖారవింద్‌ అనే ఆలయంలో దినేష్ చంద్ అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నాడు. ఆలయంలో ఉన్న రూ.కోటి 9 లక్షలతో పరారయ్యాడు. ఆ తర్వాత ఆలయానికి మళ్లీ రాలేదు. పూజారి ఫోన్ స్విచ్ఛాప్‌ రాడవంతో అనుమానం వచ్చిన ఆలయ మేనేజర్ చంద్ర వినోద్.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: ఆ దేశాలకు వెళ్ళకండి.. కేంద్రం హెచ్చరిక

ఈ ఘటన గురించి మేనేజర్ చంద్ర వినోద్‌ మీడియాతో మాట్లాడారు. ఆలయానికి చెందిన రూ.కోటి 9 లక్షలను.. దినేష్ చంద్‌ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడని చెప్పారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు దినేష్ చంద్‌ ఇంట్లో నుంచి రూ.71 లక్షల 92 వేలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు గురించి ఆరా తీస్తున్నారు. ఆ పూజారి భార్య స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి.. ఆలయానికి సంబంధించిన సొమ్మును అప్పజెప్పింది. ప్రస్తుతం పరారీలో దినేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: మను బాకర్‌కు త్రుటిలో చేజారిన మూడో పతకం

Advertisment
Advertisment
తాజా కథనాలు