Ustaad Bhagat Singh: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారీ షెడ్యూల్‌కు ఉస్తాద్ సిద్ధం

కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. మళ్లీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే కమిట్ అయిన చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఉస్తార్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగనున్నారు.

New Update
Ustaad Bhagat Singh: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారీ షెడ్యూల్‌కు ఉస్తాద్ సిద్ధం

Ustaad Bhagat Singh: పవర్‌స్టార్ మూవీ షూటింగ్స్‌లతో మళ్లీ బిజీ కానున్నారు. కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఇప్పటికే కమిట్ అయిన చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)ట్వీట్ చేసింది. సెప్టెంబరు 5 నుంచి ఉస్తాద్ భారీ షెడ్యూల్ జరగనుందని వెల్లడించింది. పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి ఓ భారీ సెట్ నిర్మించినట్లు తెలిపింది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ (Harish Shankar) కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) చిత్రం తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. 2012లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది. నాకు కొంచెం తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది అని పవన్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. ఇక డీఎస్పీ (DSP) ఇచ్చిన పాటలు అయితే యూత్‌కు పూనకాలు తెప్పించాయి. మళ్లీ పదకొండేళ్ల తర్వాత ఇద్దరి కాంబోలో తెరకెక్కితున్న చిత్రం కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది.

BRO IN OTT:
ఇక పవన్ మెగా మేనల్లుడితో కలిసి నటించిన బ్రో- ది అవతార్ మూవీ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 25న నెట్‌ఫ్లిక్స్‌ (NETFLIX) వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కాన్నునట్లు ఆ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. తొలుత ఈ సినిమాను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే వారం రోజుల ముందేప్రసారం చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. వినోదాయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. జీస్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. కేతిక శర్మ హీరోయిన్‌గా, ప్రియాంక వారియర్‌.. తేజు చెల్లెలుగా నటించారు.

Also Read: ఇది కదా మెగా ఫ్యాన్స్ అంటే.. చిరంజీవికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరింతగా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

New Update
Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram | Vijayashanti

Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram

నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. సయీ మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.

ట్రైలర్ అదుర్స్

ఇవాళ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. టైటిల్‌కు తగ్గట్లుగా తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

(Arjun Son Of Vyjayanthi)

Advertisment
Advertisment
Advertisment