Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పిల్లలతో సహా ఎంతమంది చనిపోయారంటే మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న డీసీఎం రోడ్డుపై ఆగివున్న ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా బాలానగర్ పరిధిలోని తండా వాసులుగా గుర్తించారు. మృతుల బంధువులు డీసీఎంకు నిప్పంటించారు. By srinivas 05 Jan 2024 in క్రైం మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Mahabubnagar: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ డీసీఎం (DCM) ఆగివున్న ఆటో (AUTO)ను బలంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ రోజు సాయంత్రం 8గంటల ప్రాంతంలో జరిగిన భయంకరమైన సంఘనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మృతులంతా గిరిజనులే.. ఈ మేరకు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ లో జరిగే వారంతపు మార్కెట్ కు వచ్చిన పలు తండాలకు చెందిన గిరిజనులు కూరగాయలు, తదితర నిత్యవసరాలు కొనుగోలు చేసి ఆటోలో తిరుగు పయనమయ్యారు. అయితే రోడ్డుపై ఆగిన ఆటోను వేగంగా వచ్చిన డీసీఎం బలంగా ఢీ కొట్టడంతో ఆటో కొన్ని మీటర్ల దూరం బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులతో కలిపి మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. తండా వాసుల ఆందోళన.. ఈ క్రమంలోనే స్థానికులు అందించిన సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతులను బాలానగర్ మండల పరిధిలోని పలు తండాలకు చెందిన వారిగా గుర్తించి.. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇక ఈ ఘటనతో ఆందోళనకు దిగిన స్థానిక తండా వాసులు.. అవేశంలో ప్రమాదానికి కారణమైన డీసీఎంకు నిప్పంటించగా పూర్తిగా కాలిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టారు. #road-accident #mahbubnagar #auto #dcm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి