Telangana: పిల్ల, పిల్లగాడి లగ్గానికి రావాలే.. తెలంగాణ యాసలో పెళ్లి కార్డు సాధారణంగా పెళ్లి కార్డుల్లో అచ్చమైన తెలుగుతో పాటు గ్రాంధికం, సంస్కృతం ఉంటుంది. కానీ తెలంగాణలోని కరీనంగర్ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబం విభిన్న రీతిలో తమ ఇంటి పెళ్లి వేడుక కార్డును ప్రింట్ చేయించింది. మొత్తం తెలంగాణ యాసలోనే ఈ పెళ్లి పత్రికను తయారు చేయించింది. By B Aravind 16 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి పెళ్లి అనేది ప్రతిఒక్కరికి తమ జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ముఖ్యంగా మన దేశంలో పెళ్లి వేడుకలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. పెళ్లి కార్డుల ప్రింటింగ్ మొదలుకొని.. వివాహ కార్యక్రమం పూర్తయ్యేవరకు ఆ ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్లు పెళ్లి వేడుకలు జరుపుకుంటారు. అయితే పెళ్లి కార్డుల ప్రింటింగ్ విషయంపై కొందరు ప్రత్యేక దృష్టి సారిస్తారు. విభిన్న రకాల కార్డులు తయారు చేయించుకొని తమ బంధు మిత్రులకు పంచుతుంటారు. Also Read: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే సాధారణంగా పెళ్లి కార్టుల్లో అచ్చమైన తెలుగుతో పాటు గ్రాంధికం, సంస్కృతం ఉంటుంది. వివాహం జరిగే తేది, చిరునామా, నవ వధువరుల పేర్లు, బంధువుల పేర్లు ఇలా అన్ని కలగలిపి పెళ్లి పత్రికను ముద్రిస్తారు. అయితే తెలంగాణలోని కరీనంగర్ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబం విభిన్న రీతిలో తమ ఇంటి పెళ్లి వేడుక కార్డును ప్రింట్ చేయించింది. మొత్తం తెలంగాణ యాసలోనే ఈ పెళ్లి పత్రికను తయారుచేయించింది. ''స్వర్గంలో ఉన్న ప్రేమగల మా బాపమ్మ - తాత నిండు దీవెనార్తెలతో మా ఒక్కగొనొక్క పిల్లగాడు చి. మధు లగ్గం చి.ల.సౌ పల్లవితో చేసేందుకు అటోళ్లు ఇటోళ్లు ఖాయం చేసిర్రు. అందురూ జెర యాదిమరిచిపోకుర్రి. అసలేరు వానలు ఉన్నాయని రాకుండా ఉండేరు.. జెర పొద్దుగాల్ల వచ్చి మా పిల్ల పిల్లగానికి మీ దీవెనలిచ్చి మా లగ్గం సంబురం చూసిపోతే మా మనస్సు నిమ్మలమైతది''.. అంటూ ఇలా అచ్చ తెలంగాణ యాసను పెళ్లి పత్రికలో రాసుకొచ్చారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పెళ్లి పత్రికను చూసేయ్యండి. Also Read: వీకెండ్ సెలవులు..రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 8 ప్రత్యేక ట్రైన్స్! #telugu-news #telangana #karimnagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి