Weather Report : నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

New Update
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Rain Alert For AP & TS: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత ఇది ఈశాన్య దిశవైపుగా ప్రయాణిస్తూ మరింత బలపడి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపాన్‌గా మారుతుందని పేర్కొంది.

ఈ తుపాన్ ఉత్తర దిశలో కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారి ఈ నెల 26వ తేదీ నాటికి బంగ్లాదేశ్​ను అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరానికి చేరుకునే అవకాశముందని వాతావరణశాఖ వివరించింది. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతం ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రాగాల రెండు రోజుల్లో విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

శుక్రవార, శనివరాం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో గంటకు 30నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

Also read: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా..ఉక్రెయిన్‌ పౌరులు మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు