Telangana : ఆన్‌లైన్ గేమ్స్ ఆడి అప్పులపాలు.. ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు

కరీంగనగర్ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్ జూదం కోసం స్నేహితుల వద్ద రూ.12 లక్షలు అప్పు చేసి వాటిని పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువవ్వడంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Suicide : ఈమధ్య ఆన్‌లైన్ గేముల్లో(Online Games) డబ్బులు పోగొట్టుకుని అప్పుల(Debts) బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కరీంగనగర్(Karimnagar) జిల్లా గంగాధర మండలం, మధురానగర్‌కు చెందిన పృథ్వీ (25) అనే యువకుడు.. బీటెక్ పూర్తి చేసి ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా చేరాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు వెళ్లాలని ఆ కంపెనీ సూచించడంతో రెండు నెలల క్రితం అక్కడికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి రూంలో ఉండేవాడు.

Also Read: రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతుభరోసా నిధులు విడుదల

ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు పృథ్వీని ఆన్‌లైన్ జూదంలోకి దింపారు. ఇందుకోసం అతడు స్నేహితుల నుంచి రూ.12 లక్షల వరకు అప్పులు చేశాడు. కానీ 4 రోజుల్లోనే మొత్తం ఆన్‌లైన్ గేమ్స్‌లో పోగొట్టుకున్నాడు. దీంత 15 రోజుల పాటు ఉద్యోగానికి వెళ్లకుండా రూంలోనే ఉండేవాడు. అప్పులు ఎక్కువై.. వాటిని ఎలా చెల్లించాలో తెలియక మనస్తాపం చెంది శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఉరేసుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకు మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read:  గాంధీభవన్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు