Earthquake : రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఏమి జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. By V.J Reddy 18 Aug 2024 in ఇంటర్నేషనల్ వాతావరణం New Update షేర్ చేయండి Russia Earthquake : ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు (Earthquakes) ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జపాన్, తైవాన్ దేశాల్లో భూమి కంపించడం మరువక ముందే తాజాగా రష్యా (Russia) లో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రతతో భూమి కంపించింది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన ఒక్కసారిగా భూమి కంపించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంపం వల్ల ఆస్థి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. Videos showing the shaking during the recent M7.0 earthquake in Kamchatka, Russia. That was quite a rattle. I've only seen superficial damage like broken plant pots etc so far.... pic.twitter.com/ePN5EPTKPL — Volcaholic 🌋 (@volcaholic1) August 17, 2024 పెట్రోపావ్‌లోవ్స్క్, కమ్‌చట్‌స్కీ భూకంప కేంద్రాలుగా ప్రకంపనలు వచ్చాయని US జియోలాజికల్ సర్వే పేర్కొంది. వెంటనే రష్కాలోని తీరప్రాంతాలకు సునామీ (Tsunami) వచ్చే అవకాశం ఉందని US నేషనల్ వెదర్ సర్వీస్ పసిఫిక్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తర్వాత ప్రమాదం తగ్గిందని పేర్కొంది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని తీర ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు సముద్ర మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. A 7.2-magnitude earthquake has hit off the east coast of Russia’s Kamchatka Peninsula, prompting a tsunami warning. The tremor, occurring at a depth of approximately 51 kilometers (32 miles), was reported by the European Mediterranean Seismological Centre.#Russia pic.twitter.com/CqnVcDgcBw — The Quotes (@TheQuotesLive) August 17, 2024 Also Read : జూనియర్ హత్యాచార ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు #earthquake #russia #tsunami మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి