సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడిపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ను పోలీసులు రేపు విచారించనున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు. అయితే ఇటీవల అల్లు అర్జున్‌న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో హైకోర్టు అల్లు అర్జు్న్‌కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇది కూడా చూడండి: Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్ అసలు ఏమైందంటే? డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంలో సంధ్య థియేటర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో సినిమా చూడటానికి వెళ్లారు. దీంతో అభిమానులు ఎక్కువగా థియేటర్ దగ్గరికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది. ఇది కూడా చూడండి: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే! ప్రస్తుతం శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి 'పుష్ప2' నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థికసాయం అందించారు. ఆ సంస్థకు చెందిన నిర్మాత నవీన్ యెర్నేని సోమవారం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందించారు. ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!