Food Poison : ట్రైన్‌ లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన ప్రయాణీకులు..ఆసుపత్రికి తరలింపు!

విశాఖ రైల్వే స్టేషన్ లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని 9 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిని రైల్వే సిబ్బంది, పోలీసులు రాజమండ్రి జీజీహెచ్‌ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణపాయం లేకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వైద్యులు తెలిపారు.

New Update
Food Poison : ట్రైన్‌ లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన ప్రయాణీకులు..ఆసుపత్రికి తరలింపు!

Biryani Effect : ట్రైన్‌ జర్నీ(Train Journey) మొదలైనప్పటి నుంచి కూడా ఎన్నో రకాల తినుబండారాలను అమ్మడానికి వస్తుంటారు. టీ, కాఫీలు, వాటర్‌ బాటిళ్లు, బిస్కెట్లు, టిఫిన్లు, బిర్యానీలు కూడా అమ్మకానికి వస్తుంటాయి. దూర ప్రయాణాలు చేసే వారు కచ్చితంగా ఎక్కువ సేపు రైలులో ఉండాలి కాబట్టి వారి అవసరాన్ని బట్టి తినుబండారాలు కొనుగోలు చేస్తుంటారు.

మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు అయితే ఏదోక తినుబండారాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే అలా కొని తినడం మంచిది కాదని తాజాగా రెండు సంఘటనలు తెలియజెప్పాయి. విశాఖ రైల్వే స్టేషన(Vishakhapatnam Railway Station) తో పాటు రైలులో కొనుగోలు చేసిన బిర్యానీ(Biryani) తిని సుమారు 10 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

అస్వస్థతకు గురైన ప్రయాణికులను సిబ్బంది రాజమహేంద్ర వరంలోని జీజీహెచ్‌ కు తరలించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. కానీ అస్వస్థతకు గురైన ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ లో సేలంకు వెళ్తున్న 15 మంది కార్మికులు విశాఖ రైల్వే స్టేషన్ లో బిర్యానీ కొని తిన్నారు. అది తిన్న అరగంట తరువాత నుంచి వారిలో ఐదుగురు వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో రైలు మదద్‌ యాప్‌ లో తోటి ప్రయాణికులు దీని గురించి సమాచారం ఇవ్వడంతో సాయంత్రం 6 గంటలకు వారిని రాజమండ్రి రైల్వే స్టేషన్‌ లో రైల్వే సిబ్బంది, పోలీసులు వారిని రాజమండ్రి జీజీహెచ్‌ కు తరలించారు.

ఇదిలా ఉంటే దిబ్రూగడ్‌- కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ లో పాలక్కడ్‌ కు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులు విశాఖ రైల్వే స్టేషన్‌ దాటిన తరువాత ఎగ్‌ బిర్యానీలు కొనుగోలు చేసి తిన్నారు. వారికి కూడా అదే పరిస్థితి ఎదురౌంది. వారిలో నలుగురిని రాజమండ్రి స్టేషన్‌ లో దించి ఆసుపత్రికి తరలించారు.

ఇలా ఒక్కరోజులోనే రైళ్లలో బిర్యానీ తిని సుమారు 9 మంది ఆసుపత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఎక్కడపడితే అక్కడ ఆహారాన్ని కొనుగోలు చేసి లేనిపోని జబ్బులు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

Also read: కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న సూపర్‌ స్టార్‌ మహేష్‌..ఎందుకంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు