ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన మేకలు.. అవి చేసిన తప్పేంటంటే శ్మశాన వాటికలోని చెట్ల ఆకులు, గడ్డి తిని జైలు పాలైన మేకలు విడులయ్యాయి. 2022 డిసెంబర్ 6న బంగ్లాదేశ్ లోని షహరియార్ సచిబ్ రాజీబ్ అనే వ్యక్తికి చెందిన 9 మేకలను మున్సిపల్ అధికారులు అరెస్ట్ చేయించగా ఏడాది కాలంగా బరిసాల్‌లోని బార్‌ల వెనుక బంధీలుగా ఉన్నాయి. By srinivas 13 Dec 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Goats Released From Prison : ఆకులు మేసిన పాపానికి అరెస్ట్ అయిన మేకలు(Goats) ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించి ఎట్టకేలకు విడుదలయ్యాయి. మూగజీవాల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న ఓ యజమాని వాటిని విడుపించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అయితే తాజాగా ఓ అధికారి చొరవతో మేకలు బయటకురావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఆసక్తికరమైన సంఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి : తీర్థం పేరిట జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తాగించి.. 11 మందిపై దారుణం ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. 2022 డిసెంబర్ 6న షహరియార్ సచిబ్ రాజీబ్ అనే వ్యక్తికి చెందిన తొమ్మిది మేకలుండేవి. అయితే ప్రతిరోజులాగే వాటిని మేతకు తీసుకెళ్లగా ఒకరోజు స్థానిక శ్మశాన వాటికలోని చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయి. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న మున్సిపల్ అధికారులు సచిబ్ చెందిన 9 మేకలను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఏడాది కాలంగా బరిసాల్‌లోని బార్‌ల వెనుక ఆ మేకలు బంధీలుగా ఉన్నాయి. తన మేకలను విడిపించుకునేందుకు వాటి యజమాని పలు విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇటీవల బరిసాల్ సిటీ కార్పొరేషన్‌కు కొత్త మేయర్ ఎన్నికయ్యాడు. దాంతో సచిబ్ రాజీబ్ ఈ విషయాన్ని గతేడాది బారిసల్ సిటీ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి స్వపోన్ కుమార్ దాస్ వెల్లడించారు. అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన మేయర్.. మేకలను విడిచిపెట్టాలని ఆదేశించారు. మేయర్ చొరవతో అధికారులు బంధించి ఉన్న తొమ్మిది మేకలను రాజీబ్‌కు నవంబర్ 24 వ తేదీన అప్పగించారు. ఏడాది పాటు జైలులో శిక్ష అనుభవించిన తన మేకలు ఎట్టకేలకు బయటికి రావడంతో వాటి యజమాని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక మూగ జీవులకు శిక్ష విధించడం ఇదే తొలిసారి కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎనిమిది గాడిదలు లక్షల విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. రష్యాలోని కోమి ప్రావిన్స్‌లోగల సిక్టివ్‌కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్‌లు, గాడ్జెట్‌లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నెటిజన్లు దీనిపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. Also Read : దారుణం.. 25 కి.మీ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు.. చివరికి Also Read : దారుణం.. యువతిని హత్య చేసి కాల్చేశారు.. #crime #prison #goats మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి