US Gun Fire:చికాగో కాల్పులు..ఎనిమిది మంది మృతి

అమెరికా అంటే గన్ కల్చర్ అన్నట్టు తయారైంది. ఈమధ్య మరీ ఎక్కవు అయిపోతోంది..తుపాకుల మోత మోగిస్తున్నారు. తాజాగా చికాగో ఓ ఉన్మిది రెచ్చిపోయాడు. మొత్తం మూడు చోట కాల్పులు జరిపాడు. ఇందులో మొత్తం 8మంది మరణించారు.

New Update
US Gun Fire:చికాగో కాల్పులు..ఎనిమిది మంది మృతి

Chicago:అమెరికాలో గన్ కల్చర్‌కు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. అదేదో ఆట వస్తువు అన్నట్టు వాడుతున్నారు. ముఖ్యంగా యువత దీన్ని తెగ మిస్ యూజ్ చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం పెట్టిన చట్టాన్ని తమ స్వార్ధాల కోసం వాడుకుంటూ రెచ్చిపోతున్నారు. అమెరికాలో మరోసారి గన్ కల్యర్ తన పంజా విసిరింది. నిన్న చికాగోలో మూడు చోట్ జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. మూడు చోట్లా ఒకే వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం కాల్పులుల జరిపిన ఉన్మాది పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Also Read:ఇక కాస్కోండి తమ్ముళ్లు… షర్మిల రాజకీయ పోరాట యాత్ర వైపే అందరిచూపు..!

అక్కడిక్కడే చనిపోయిన మృతులు...

అమెరికాలో అతి పెద్ద నగరాల్లో ఒకటైన చికాగోలో జోలియట్ ప్రాంతంలోని 2200 బ్లాక్ ఆఫ్ వెస్ట్ ఏకర్స్ రోడ్‌లో ఈ ఘోరం జరిగింది. తున్మాది తుపాకీలు తీసుకులు ఇద్దరి ఇళ్ళల్లోకి చొరబడి కాల్పలుకు తెగబడ్డాడు. ఈ దాడిలో రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు. సడెన్‌గా నిందితుడు ఇంట్లోకి చొరబడి కాల్పులు జరపడంతో ఎవరూ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు చెప్పారు.

23 ఏళ్ళ రోమియో నాన్స్..

ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి పేరు రోమియో నాన్స్. ఇతనికి 23 ఏళ్ళు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలకు, నిందితుడికి ఇంతకు ముందే పరిచయం ఉందని తెలుస్తోంది. వారితో అతనికి ఏదో వైరం ఉందని...అందుకే కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాల్పుల తర్వాత యువకుడు పరారయ్యాడు. అయితే నిందితుడు మరిన్ని కాల్పులు జరపకముందే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు