BIG BREAKING: అశ్లీల కంటెంట్ ఉన్న 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం కొరడా.. ఏకంగా బ్యాన్! కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్‌ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది. By Trinath 14 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. దేశంలో పబ్లిక్ యాక్సెస్ ఉన్న 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లకు లింక్ అప్ అయిన 57 సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేసింది. ఈ 10 యాప్స్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 7, యాపిల్ యాప్ స్టోర్‌లో 3 ఉన్నాయి. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 'సృజనాత్మక వ్యక్తీకరణ' ముసుగులో అశ్లీలత, అసభ్యత కంటెంట్‌ను ప్రమోట్ చేయకూడదని తేల్చిచెప్పారు. అసభ్యకరమైన కంటెంట్‌ను టెలిక్యాస్ట్ చేస్తున్న 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను తొలగించినట్లు ప్రకటించారు. భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు, మీడియా, మహిళల హక్కులు, పిల్లల హక్కులలో ప్రత్యేకత కలిగిన డొమైన్ నిపుణులతో సంప్రదించిన కేంద్రం నిర్ణయం తీసుకోబడింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో హోస్ట్ చేసిన కంటెంట్‌లో ఎక్కువ అశ్లీలతే ఉందని కేంద్రం చెబుతోంది. మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరించినట్లు కేంద్రం గుర్తించింది. ఇది ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సంబంధాలను చెడ గొట్టేలా ఉందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అంటోంది. నగ్నత్వం, లైంగిక హింసను చిత్రీకరించే ఫ్లాట్‌ఫామ్స్‌కు ఇది హెచ్చరిక. కంటెంట్‌లో లైంగిక దూషణలను కేంద్రం అంగీకరించేది లేదని ఈ నిర్ణయంతో స్పష్టమవుతోంది. IT చట్టంలోని సెక్షన్ 67, 67A, IPCలోని సెక్షన్ 292తో పాటు మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం, 1986లోని సెక్షన్ 4ను ఈ OTT ఫ్లాట్‌ఫామ్స్ ఉల్లంఘించినట్లు నిర్ధారించింది కేంద్రం. బ్యాన్ ఫ్లాట్ ఫామ్స్ బ్యాన్ లిస్ట్: డ్రీమ్స్ ఫిల్మ్స్, వూవి, యెస్స్మా, అన్‌కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియాన్ ఎక్స్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రాబిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్‌ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుగీ, చికూఫ్లిక్స్, ప్రైమ్ ప్లే కేంద్రం బ్లాక్ చేసిన లిస్ట్ లో ఉన్నాయి. #ott మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి