Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.

New Update
Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

AP : ఏపీలోని పల్నాడు(Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు(Private Travels Bus) మంగళవారం రాత్రి హైదరాబాద్‌(Hyderabad) కు బయల్దేరింది. అరవింద ట్రావెల్స్‌ కు చెందిన బస్సు పర్చూరు, చిలకలూరి పేట మీదుగా హైదరాబాద్‌ కు వెళ్లాల్సి ఉంది. బస్సు బయల్దేరిన సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

వారిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెంకు చెందినవారు ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా కూడా సొంత ఊరిలో ఓటు వేసి.. తిరిగి హైదరాబాద్‌కు వెళుతున్న వారే. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం అన్నంబొట్లవారిపాలెం - పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు దగ్గర.. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బస్సును ఎదురుగా వేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది.

దీంతో వెంటనే క్షణాల్లో టిప్పర్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు సజీవ దహనం కాగా... మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులో నుంచి క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీకర వాతావరణం నెలకొంది. వెంటనే స్థానికులు ఈ ప్రమాదంపై 108, పోలీసులకు స చారం అందించారు. వెంటనే వారంత అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ వెంటనే చీరాల, యద్దనపూడి, చిలకలూరిపేట, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాయి.

బస్సులో చిక్కుకుపోయి తీవ్ర గాయాల పాలు అయిన వారిని బయటకు తీశారు.. వారిని 108 వాహనాల్లో 20 మంది వరకు గాయపడినవారిని చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. బైపాస్‌ పనులు జరుగుతుండటంతో.. తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయి ఉందని స్థానికులు చెబుతున్నారు. టిప్పర్‌ అతి వేగంతో దూసుకురావడంతో టిప్పర్‌ డ్రైవర్ కంట్రోల్ చేయలేక బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు.

Also read: భోజనానికి ముందు కానీ, తరువాత కానీ…టీ , కాఫీలు తాగుతున్నారా..అయితే తస్మాత్‌ జాగ్రత్త!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment