Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి మహారాష్ట్రలో భారీ ప్రమాదం జరిగింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్లో గరువారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. రెస్క్యూ టీం మంటలు ఆర్పుతున్నాయి. By B Aravind 23 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మహారాష్ట్రలో భారీ ప్రమాదం జరిగింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్లో గరువారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. మంటలు భారీగా ఎగసిపడి మరో రెండు బిల్డింగ్లకు కూడా వ్యాపించాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. Also Read: రేవ్ పార్టీ సూత్రధారి తెలుగువాడే.. దోసెలమ్మి రూ.కోట్లకు ఎదిగి..! 15 అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరీ భవనంలో 8 మంది చిక్కుకోగా.. వారిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, దాని పక్కనే ఉన్న ఇళ్లు కూడా పాక్షికంగా కాలిపోయాయి. Also read: ఇలా చేస్తేనే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా? జూన్ 1 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు.. Dombivli MIDC Blast: Fire breaks out at Amber chemicals factory after boiler explosion, at least 35 injured#Dombivli #DombivliFire #Maharashtra #DombivliBlast #Thane #ThaneBlast #MIDC #MIDCBlast pic.twitter.com/Eolghrk4UL — Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 #telugu-news #fire-accident #boiler మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి