Railway Jobs : రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.

రైల్వే జాబ్స్ కోసం చూస్తున్నారా...నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని వెయిటింగా...ఇదిగో అయితే ఇది మీ కోసమే. ఇండియన్ రైల్వేశాఖ భారీగా పోస్టులను విడుదల చేసింది. ఏకంగా 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

New Update
Jobs : ఇంటర్ పాసై ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. 8వేల ఉద్యోగాలను ప్రకటించిన రైల్వేస్

Jobs in Indian Railways : రైల్వేలో ఉద్యోగాల(Railway Jobs) జాతర మొదలైంది. వేల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్(Notification) వేసింది. రైల్వే జాబ్ గోల్‌గా పెట్టుకున్నవాళ్ళందరికీ ఇదే మంచి అవకాశం అంటోంది రైల్వే శాఖ. ట్రైన్ డ్రైవర్, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఏఎల్పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(Railway Recruitment Board) ప్రకటించింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఫిబ్రవరి 19వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు పెట్టుకోవాలి. దేశ వ్యాప్తంగా మొత్తం 5,696 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది రైల్వేశాఖ. అప్లై చేసిన తర్వాత అన్ని అర్హతలు ఉండి జాబ్ వస్తే మొదటి నెల నుంచే 19,900 జీతం ఉంటుంది. ఇది తరువాత గరిష్టంగా 63,200 వరకు పెరుగుతుంది.

Also Read : Free Bus : ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్‌ భేటీ!

అర్హతలు..

రైల్వేలో జాబ్స్ కు అప్లే చేసుకోవాలనుకునే వారు కనీసం ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాంగలో మూడేళ్ళ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా ఏఐసీటీటీ(AICTT) గుర్తింపు ఉన్న ఏదైనా విద్యాసంస్థ నుంచి పైన చెప్పిన బ్రాంచ్‌లలోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చును.

వయసు..

18 సంవత్సరాలు నిండి కచ్చితంగా నిండి ఉండాలి. ౩౦ ఏళ్ళలోపువారై ఉండాలి. కానీ ఇందులో మళ్ళీ కేంద్ర నింబధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంది.

అప్లికేషన్ ఫీజు...

రైల్వే జాబ్స్‌కు దరఖాస్తులు ఆల్రెడీ ఆన్‌లైన్లో దొరుకుతున్నాయి. జనవరి 20 నుంచి మొదలైన అప్లికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 19 వరకు కొనసాగనుంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ తో పాటూ మహిళలకు అప్లికేషన్ ఫీజు కింద 250రూ. తీసుకొంటున్నారు. మిగిలిన వారు మాత్రం 500రూ. చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్లు రైల్వే వెబ్ సైట్‌లో లభ్యమవుతాయి.

Also Read : APPSC : ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు