SBIలో 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు ఆ స్కిల్ ఉంటే చాలు ప్రభుత్వం రంగ బ్యాంక్ ఎస్‌బీఐ (SBI)నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (సీబీఓ) పోస్టుల నియామకాలు చేబట్టబోతున్నట్లు ప్రకటన విడుదలచేసింది. ఏపీలో 400, తెలంగాణలో 425 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత. By srinivas 07 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి SBI JOBS : భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) వరుస నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. ఇటీవలే వివిధ సర్కిళ్లలో మొత్తం 8,773 పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దేశవ్యాప్తంగా తమ సంస్థలో ఉన్న సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (సీబీఓ) పోస్టుల నియామకాల భర్తీ చేపట్టబోతున్నట్లు ప్రకటన చేసింది. ఇందులో మొత్తం 5280 ఖాళీలుండగా ఆంధ్రప్రదేశ్‌లో 400, తెలంగాణలో 425 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు బ్యాంకుల్లో ఆఫీసర్ హోదాలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏదో ఒక సర్కిల్‌కే దరఖాస్తు చేసుకోవాలి. అవకాశముంటే ఆ సర్కిల్‌లోనే విధులు నిర్వహిస్తారు. స్కేల్ 4 ఆఫీసర్ స్థాయికి చేరుకునే వరకు లేదా 12 ఏళ్ల అనుభవం (వీటిలో ఆలస్యమైనదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు) అదే సర్కిల్‌లో సేవలు అందించాలి. ప్రొబేషన్ వ్యవధి 6 నెలలు. ఈ వ్యవధిలో సంతృప్తికరంగా విధులు నిర్వర్తించినవారిని స్కేల్-1 ఆఫీసర్‌గా అవకాశమిస్తారు. అప్పటి వరకు వీరిని సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (సీబీఓ)గా వ్యవహరిస్తారు. అర్హతలు : ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు పరిశీలిస్తే.. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి రెండేళ్లు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకు (రీజనల్ రూరల్ బ్యాంకు)ల్లో ఆఫీసర్ స్థాయిలో పనిచేసి ఉండాలి. అక్టోబరు 31, 2023 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. అక్టోబరు 31, 2023 నాటికి రెండేళ్ల అనుభవం పూర్తి కావాలి. దరఖాస్తు చేసుకున్న సర్కిల్‌కు చెందిన స్థానిక భాషలో రాయడం, మాట్లాడటం, చదవడం, అర్థం చేసుకోవడం రావాలి. ఇందుకోసం అర్హత పరీక్ష నిర్వహిస్తారు. టెన్త్ లేదా ఇంటర్ లో లోకల్ లాంగ్వేజ్ చదివిన అభ్యర్థులకు పరీక్ష ఉండదు. ఇదికూడా చదవండి : SBI Clerk Recruitment: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.. ఇంకా రెండు రోజులే గడువు పరీక్ష విధానం : ఇందులో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష వ్యవధి 2 గంటలు. సెక్షన్ల వారీ సమయ నిబంధన ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలకు 30 నిమిషాలు. బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 40 నిమిషాలు. జనరల్ అవేర్‌నెస్/ ఎకానమీ 30 ప్రశ్నలకు అరగంట. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలకు 20 నిమిషాలు కేటాయించారు. డిస్క్రిప్టివ్: ఈ పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. ఇంగ్లీష్ లో రైటింగ్ స్కిల్స్ పరిశీలిస్తారు. లెటర్ రైటింగ్, ఎస్సేల ద్వారా అభ్యర్థులు పనితీరు తెలుసుకుంటారు. ఇక ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు. ఆన్‌లైన్ టెస్టు (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ మార్కులతో నియమకాలు చేపడతారు. పరీక్ష మార్కులు 75, ఇంటర్వ్యూలో 25 మార్కులను కుదించి మొత్తం వచ్చిన మార్కులతో కలిపి మెరిట్, రిజర్వేషన్, సర్కిల్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. దరఖాస్తు ఫీజు.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.750. ఇతర వర్గాలు చెల్లించనవసరం లేదు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2023 డిసెంబర్ 12. కాగా 2024 జనవరిలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. పరీక్ష కేంద్రాలు: ఏపీ: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ: హైదరాబాద్ పూర్తి వివరాలకోసం కింద లింక్ లను క్లిక్ చేయండి : https://cdn.thepublive.com/rtv/media/pdf_files/blog/wp-content/uploads/2023/11/21172933/sbi-cbo-notification.pdf https://sbi.co.in/documents/77530/25386736/17102022_Final+Advertisement.pdf/0399e3a4-4e16-af69-c270-f61c385d01a6?t=1666017092279 #sbi #jobs #cbo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి