Hyderabad: భూ వివాదంలో అడ్డంగా బుక్కైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు

పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కందాల ఉపేందర్‌రెడ్డి భూ వివాదంలో అడ్డంగా బుక్ అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లో ఓ స్థలాన్ని కబ్జా చేసినట్లు షేక్‌పేట తహసీల్దార్‌ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Hyderabad: భూ వివాదంలో అడ్డంగా బుక్కైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు

Upendar Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌ (Hyderabad) బంజారాహిల్స్‌లోని భూ వివాదానికి సంబంధించిన ఇష్యూలో 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షేక్‌పేట తహసీల్దార్‌ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి.. బంజారాహిల్స్‌ (Banjaarahills) రోడ్‌ నం.3లో ప్లాట్‌ నంబరు 8-సీ పేరుతో ఉన్న 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని ‘దీప్తి అవెన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (Deepti Avenue Private Limited) సంస్థకు చెందిన ఉపేందర్‌రెడ్డితో పాటు కొంతమంది ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అయితే గతంలో ప్లాట్‌ నం.8-డీలో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్‌రెడ్డి.. ‘8-సీ’లో ప్లేస్ కూడా తనదేనని ప్రచారం చేశారు. ఈ సర్వే నంబరులో మొత్తం 2.25 ఎకరాలు ఉండగా అందులో అత్యధిక భాగం షౌకత్‌నగర్‌ బస్తీగా ఏర్పడింది. మిగతా 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది.

ఇది కూడా చదవండి : New year: న్యూ ఇయర్‌ వేళ కిక్కే కిక్కు.. మూడ్రోజుల్లో ఎంత తాగేశారంటే

ఈ క్రమంలోనే స్థలంలో అవెన్యూ సంస్థ గతంలోనూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్‌ స్థలాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని ల్యాండ్‌ బ్యాంక్‌లో ఉంచారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితిని కొనసాగించాలని 2010లో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శనివారం తహసీల్దార్‌ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించగా ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి, షెడ్లు నిర్మించి వైన్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్‌ పోలీసుల సహకారంతో శనివారం రాత్రి తహసీల్దార్‌తో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్‌ చేశారు. తహసీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఉపేందర్‌రెడ్డి తదితరులపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471; సెక్షన్‌ 3 ఆఫ్‌ పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసుపై పోలీసులు తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? కందాల ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. 2018లో కాంగ్రెస్ పాలేరు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కందాల ఉపేందర్ రెడ్డి తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 2023లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు