Hyderabad : హైదరాబాద్‌లో మత్తు చాక్లెట్లు... విద్యార్ధులు, యువతే టార్గెట్

తెలంగాణలో గంజాయి చాక్లెట్ల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. నెల రోజుల వ్యవధిలో నాలుగు చోట్ల గంజాయి చాక్లెట్లు పట్టబడ్డాయి. ఈరోజు తాజాగా రాజేంద్రనగర్‌, నార్సింగ్ పరిధిలో పెద్ద ఎత్తున చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు.

New Update
Hyderabad : హైదరాబాద్‌లో మత్తు చాక్లెట్లు... విద్యార్ధులు, యువతే టార్గెట్

Ganja Chocolates : తెలంగాణ(Telangana) మత్తు ఎక్కుతోంది. విద్యార్ధులు(Students), యవత(Youth) లక్ష్యంగా గంజాయి దందాను యధేచ్చగా నిర్వహిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చాక్లెట్ల(Chocolates) లో గంజాయి(Ganja) ని కలిపి మరీ అమ్ముతున్నారు. మెట్రో నగరాలతో పాటు మారుమూల పల్లెల్లోనూ గంజాయి దందా విచ్చలవిడిగా సాగుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో నాలుగు చోట్ల గంజాయి చాక్లెట్లు అమ్మే దుకాణాలను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా గంజాయి చాక్లెట్లు దొరికాయి. దీంతో నిందితుడిని అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు.

Also Read : Telangana:లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆరు గ్యారంటీల అమలు

విద్యార్ధులే టార్గెట్..

విద్యార్ధులు, యువతే టార్గెట్.. సూళ్ళ దగ్గర ఉండే పాన్ షాపు(PAN Shop) ల్లో విక్రయాలు.. హైదరాబాద్‌(Hyderabad)లో మరోసారి గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. తాజాగా రాజేంద్రనగర్‌లో గంజాయి చాక్లెట్ల గుట్టు రట్టు అయింది. 4కేజీల చాక్లెట్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. కోకాపేట్, రాంకీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దగ్గర కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ ఓ గదిలో పలు బ్రాండ్స్‌కు చెందిన గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిషాకు చెందిన సోమ్యారాజన్ అనే వ్యక్తి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిషా నుంచి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు తెలిసింది. మరోవైపు ఖమ్మం జిల్లా వరంగల్ క్రాస్ రోడ్డులో భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పొలీసులు. ఔరంగబాద్ కు చెందిన ఇద్దరు మహిళల నుంచి ఎనిమిది కిలోల గంజాయి.. మూడు కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Ganja Chocolates

విచ్చలవిడిగా దందా...

రెండు రోజుల క్రితం ఉప్పల్, రామాంతపూర్‌లలో కూడా గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న వ్యక్తి ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన ఫిరోజ్ జెనా అలియాస్ రవిగా గుర్తించిన పోలీసులు అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా 35 కిలోల గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. ఇతను కార్మికులకు, విద్యార్ధులకు ఈ చాక్లెట్లను అమ్ముతున్నాడు. మరోవైపు ఖమ్మంలో కూడా గంజాయి చాక్లెట్లు భారీగా పట్టుబడ్డాయి.

భయపడుతున్న తల్లిదండ్రులు...

గంజాయి చాక్లెట్టు ఇంతలా విస్తరించడం మీద తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. ఇంతకు ముందు వరకు గంజాయి, డ్రగ్స్ కేవలం నగరాల్లో, ఎలైట్ పీపుల్ మధ్యల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మారు మూల ప్రదేవాలకు, చిన్న చిన్న ఊళ్ళకూ కూడా పాకుతుండండతో... అది కూడా చిన్న పిల్లలు తినే చాక్లెట్ల రూపంలో అమ్ముతుండడంతో పేరెంట్స్ భయపడుతున్నారు. పిల్లలు చాక్లెట్లు అనగానే ఇష్టంగానే తింటారని..వారికి అసలు గంజాయి అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటప్పుడు తేడాను ఎలా కనిపెడతారని అడుగుతున్నారు. ఇక మీదట ఏ చాక్లెట్ తిన్నా అనుమానం కలిగి, భయపడేలా పరిస్థితి అయిపోయిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : లంచగొండి పోలీస్.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన హెడ్‌ కానిస్టేబుల్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు