AI: హాలీవుడ్ హీరోలను మించిన అందం.. ఏఎన్ఆర్ ఏఐ లుక్స్ వైరల్

ఏఐ టెక్నాలజీతో రీక్రియేట్ చేసిన దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన వీడియోను ఆర్జీవీ నెట్టింట పోస్ట్ చేశాడు. ఇందులో హాలీవుడ్ హీరోల కనిపిస్తున్న ఏఎన్ఆర్ ట్రెండీ లుక్స్ కు ఫిదా అవుతున్న అభిమానులు ఆయన అందాలను తెగ పొగిడేస్తున్నారు.

New Update
AI: హాలీవుడ్ హీరోలను మించిన అందం.. ఏఎన్ఆర్ ఏఐ లుక్స్ వైరల్

AI: టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) మరో ఏఐ వీడియోతో అభిమానులను అలరించాడు. ఇటీవలే ఏఐ (AI) టెక్నాలజీతో రీక్రియేట్ చేసిన అలనాటి అమ్మాయిల కలలు రాకుమారుడు, సోగ్గాడుగా ప్రజాదరణ పొందిన దివంగత నటుడు శోభన్ బాబు (Shoban Babu) వీడియోను పోస్ట్ చేయగా హాలీవుడ్ హీరోలను తలదన్నే స్టైల్ లో కనిపించాడు. అయితే తాజాగా మరో దివంగత స్టార్ నటుడు వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ఆశ్చర్యపరిచాడు వర్మ.

ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ద్వారా దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni nageswarrao) కు సంబంధించిన ఓ వీడియోను రీక్రియేట్ చేయగా.. హాలీవుడ్ హీరో రేంజ్ ఫీచర్స్ లో కనిపిస్తున్నారు. ఈ తరం హీరోల కండలు, టోన్డ్ ఫేస్, ట్రెండీ దుస్తులతోపాటు హెయిర్ స్టైల్ ను రీ క్రీయేట్ చేసిన వీడియోను రామ్ గోపాల్ వర్మ షేర్ చేస్తూ.. 'INTELLIGENTLY created ARTIFICIAL ANR' అంటూ నెట్టింట రీ పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

ఇక ఇటీవల 'ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన శోభన్ బాబు' మోడరన్ లుక్, సిక్స్ ప్యాక్ బాడీతో బీచ్ ఒడ్డున అలా స్లో మోషన్‌లో నడుచుకుంటూ రాగా.. బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతున్న 'గోరింటాకు' సినిమాలోని 'కొమ్మ కొమ్మకో సన్నాయి' పాట ఈ వీడియోకి అదనపు ఆకర్షణగా నిలిచింది. దీంతో పాటుగా ఏఐ జనరేట్ చేసిన మరికొన్ని వీడియోలు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుంటే ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు