Accident : ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు... 31 మంది మృతి! ఆఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 31 మంది మరణించారు. వంతెనపై నుంచి బస్సు నదిలో పడిపోయింది. ఈ బస్సు బుర్కినా ఫాసో వెళుతోంది. అకస్మాత్తుగా బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిందని అధికారులు చెబుతున్నారు. By Trinath 28 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bus Accident : ఆఫ్రికన్ దేశం(African Country) మాలి(Mali) లో వంతెనపై నుంచి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించగా, 10 మంది గాయపడినట్లు సమాచారం. కెనిబా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బుర్కినా ఫాసో వైపు వెళ్తున్న బస్సు ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న వంతెనపై నుంచి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు(Bus) నైరుతి మాలియన్ నగరం కెనిబా నుంచి బుర్కినా ఫాసోకు ప్రయాణిస్తోందని జిన్హువా వార్తా(Xinhua News) సంస్థ నివేదించింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మాలిలో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఎందుకంటే రహదారి, వాహనాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో సెంట్రల్ మాలిలో రాజధాని బమాకో వైపు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో 15 మంది మరణించారు, 46 మంది గాయపడ్డారు. రెండు వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ట్రాఫిక్ మరణాలలో దాదాపు నాలుగింట ఒక వంతు ఆఫ్రికాలోనే సంభవిస్తున్నాయి. Also Read : విహారిని అందుకే పీకేశాం.. ఏసీఏ సంచలన లేఖ! #road-accident #mali #bus-plunges మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి