GHMC Dogs: పదేళ్లలో 4లక్షల మందిని కరిచిన కుక్కలు.. ఫలించని ABC ఆపరేషన్! హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద మరింత రెట్టింప్పైంది. ఎన్ని చర్యలు చేపట్టినా ఏడాదికి 30వేలు, గడిచిన పదేళ్లలో 4 లక్షల కుక్క కాటు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ABC కార్యక్రమం కోసం ఏడాదికి రూ.11.5 కోట్లు ఖర్చు చేస్తోంది జీహెచ్ఎంసీ. By srinivas 19 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Dog Bite: తెలంగాణ రాష్ట్రంలో కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే అత్యధికమంది కుక్క కాట్లకు గురువుతున్నారు. జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నప్పటికీ నగరంలో నివాసితులపై వీధికుక్కల దాడులు ఆగట్లేదు. ప్రతి సంవత్సరం నగరంలో 30వేల కుక్క కాటు కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. 2014 నుంచి 2024 మధ్యకాలంలో 4 లక్షల కుక్కల బెడద ఫిర్యాదులతో పాటు గత దశాబ్దంలో నగరంలోనే 3 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని పౌర సంఘం డేటా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కుక్కలు.. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కుక్కలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2023లో కుక్కల దాడుల కారణంగా హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్ 75వేలకు మించి రేబిస్ టీకాలు వేసినట్లు వెల్లడించింది. ఇక ABC (యాంటీ రేబిస్ ప్రోగ్రామ్)ను అమలు చేయడానికి GHMC ఆరు షెల్టర్ మేనేజర్‌లు, 22 పారా-వెటర్నరీ వైద్యులు, 362 సెమీ-స్కిల్డ్ వెటర్నరీ వర్కర్లను అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించింది. వారంతా కుక్కలను పట్టుకునేందుకు 30 వాహనాలతోపాటు కోసం 20 మందిని అద్దెకు తీసుకుంటారు. మొత్తంగా GHMC సంవత్సరానికి రూ. 11.5 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ కుక్కల బెడద ప్రజలను వీడట్లేదు. రౌండ్-ది-క్లాక్ డాగ్ క్యాచింగ్ ఆపరేషన్లు.. ఇక జీహెచ్ఎంసీ పలు చర్యలను చేపట్టింది. వార్డు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి అన్ని జంతు సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసింది. NGOలు, కార్యకర్తలు, వాలంటీర్లు, పశువైద్యులను సంప్రదించింది. వారి సిఫార్సులలో రౌండ్-ది-క్లాక్ డాగ్ క్యాచింగ్ ఆపరేషన్లు, 1,066 పాఠశాలల్లో అవగాహన ప్రచారాలు, కుక్క ప్రవర్తన, కాటు నిర్వహణపై నివాసితులకు అవగాహన కల్పించింది. 'కమిటీ సలహా ప్రకారం మేము కుక్కలను పట్టుకోవడంలో మూడు షిఫ్టులను నిర్వహిస్తాం. ABC-AR కార్యక్రమం గురించి రెసిడెన్షియల్ అసోసియేషన్లు, పాఠశాలల్లో అవగాహన పెంచుతాం. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి మార్గదర్శకాలను అందిస్తాం' అని జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. ఇక జనంపై వీధి కుక్కల దాడులు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టేట్ లెవల్ కమిటీలు వేయడం కాదని.. దాడులు నివారించాలని తేల్చి చెప్పింది. పరిష్కార మార్గాలతో తదుపరి విచారణకు హాజరుకావాలని ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. #ghmc #dog-bites #abc-oparation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి