CA Exams : విద్యార్ధులకు సూపర్ న్యూస్.. ఇక మీదట ఏడాదికి మూడుసార్లు సీఏ పరీక్షలు

ఛార్టెడ్ అకౌంట్ స్టూడెంట్స్‌కు శుభవార్త. ఇక మీదట ఏడాదికి మడుసార్లు సీఏ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటివరకు సంవత్సరానికి రెండుసార్లు చొప్పున నిర్వహిస్తున్న పరీక్షలను మరొకసారి కూడా నిర్వహించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

New Update
TS ECET : ఈసెట్‌ ఫలితాల తేదీ ఖరారు..

CA Exams For 3 Times : సీఏ(CA) చదవాలని చాలా మందికి ఉంటుంది. కానీ సీఏ చదవడం చాలా కష్టం. మామూలుగా ఆషామాషీగా చదివితే సరిపోదు. అదీ కాక చాలా మందికి నాలుగు, ఐదు అటెంప్ట్స్ చేస్తే కానీ సక్సెస్ కాలేరు. అయితే ఈ పరీక్సలు ఏడాదికి రెండే సార్లు ఉంటుంది. ఈ కష్టాలను తీర్చాలని డిసైడ్ అయింది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(Institute Of Charted Accounts Of India). దేశవ్యాప్తంగా ఇక మీదట ఏడాదికి మూడుసార్లు పరీక్షలు(3 Times Exams) నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇప్పటివరకు సంవత్సరానికి రెండుసార్లు మే/జూన్‌లో ఒకసారి, నవంబర్/డిసెంబర్‌లో మరో సారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలను మూడుసార్లు నిర్వహించాలని ఐసీఏఐ నిర్ణయించింది.

మే, నవంబర్‌లలో రెండు సార్లు జరుగుతున్నాయి కాబట్టి మూడోసారి పరీక్షను జనవరిలో నిర్వహించాలని కౌన్సిల్ నిర్ణయించింది. త్వరలోనే ఈ విషయాన్ని ఐసీఏఐ(ICAI) వెబ్‌సైట్‌ అధికారికంగా తెలపనుంది. ఇంటర్, డిగ్రీ విద్యార్ధులు ఈ ఎగ్జామ్స్ రాయడానికి అర్హులు. ఈ పరీక్షలు మూడు స్థాయిల్లో ఉంటాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ ఉంటాయి. ఫౌండేషన్ పరీక్షలో పాసయితేనే సీఏ ఇంటర్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇంటర్‌లో కూడా రెండు గ్రూపులు పాసైన తర్వాతనే సీఏ ఫైనల్ ఎగ్జామ్స్‌కు హాజరు కావచ్చును. ఈ రూల్స్ ఇంటర్ విద్యార్ధులకు మాత్రమే.

అదే డిగ్రీ పాసయిన విద్యార్ధులు అయితే ఫౌండేషన్ ఎగ్జామ్ రానక్కర్లేదు. అవి లేకుండానే నేరుగా ఇంటర్ పరీక్షలకు హాజరవ్వొచ్చు. దేశ వ్యాప్తంగా ఏడాదికి సీఏ పరీక్షలను 1.25 లక్షల మంది ఫౌండేషన్ కోర్సులోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఇవి మూడు సార్లు నిర్వహించడం వలన మరింత మంది ఈ కోర్సులో ప్రవేశాలు పొందుతారని చెబుతున్నారు. అలాగే పరీక్సల మధ్య విరామం 2నెలలు తగ్గడం కూడా విద్యార్ధులకు కలిసి వచ్చే అంశం.

Also Read : Sela Tunnel: ప్రపంచంలోనే అతి పొడవైన డబుల్-లేన్ సొరంగం.. నేడు జాతికి అంకితం చేయనున్న మోదీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు