/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/crime-1-jpg.webp)
Uttar Pradesh: చిన్న భూ వివాదం ఒకే ఇంటిలోని ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. భూ తగాదా ఉన్నవారు తమకు తగాదా ఉన్న కుటుంబ సభ్యులును జీపులో వచ్చి తుపాకులతో కాల్చి చంపిన దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో (Lucknow) లో చోటు చేసుకుంది. యోగి ఆదిత్య నాథ్ పాలనలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
ఈ దారుణానికి సంబంధించిన సంఘటన అంతా కూడా ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో (CC Camera) రికార్డు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని లక్నో జిల్లా మలిహాబాద్ లో ఈ దారుణ ఘటన జరిగింది. మునీర్ ఖాన్, అతని భార్య ఫర్హీన్ గత కొంత కాలంగా ఓ భూమి విషయంలో కొందరితో తగాదాలు ఉన్నాయి.
అయితే కొంతకాలం క్రితం వీరు తమతో తగాదా ఉన్నవారిని దూషించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు ప్రత్యర్థి వర్గం జీపులో నేరుగా మునీర్ ఖాన్ ఇంటిలోనికి దూసుకుని వచ్చారు. ఆ సమయంలో ఇంటి ముందు మునీర్ ఖాన్ ఉన్నారు. నిందితులు అతనితో కాసేపు మాట్లాడారు.
राजधानी लखनऊ ट्रिपल मर्डर लाइव.. pic.twitter.com/zQ73o5dAsN
— Suraj Shukla (@suraj_livee) February 2, 2024
ఆ సమయంలో ఒక్కసారిగా గొడవ పెద్దది కావడంతో వారి వెంట తెచ్చుకున్న తుపాకీతో అతనిని కాల్చి చంపారు. అక్కడితో ఆగకుండా ఇంటి లోపల ఉన్న మునీర్ భార్య ను, అతని కుమారుడు హంజాలా ను కూడా తుపాకీతో కాల్చేశారు. వారు ముగ్గురు చనిపోయారు అని నిర్థారించుకున్న తరువాత నిందితులు అక్కడి నుంచి అదే జీపులో పరారయ్యారు.
ఈ దారుణానికి సంబంధించిన ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో పోలీసులు జీపు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితుడు లల్లన్ ఖాన్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. యూపీలో నిందితులను యోగీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. మరీ ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అందరూ వేచి చూస్తున్నారు.
మూడు మృతదేహాలను శుక్రవారం పోస్టుమార్టానికి పంపనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Also read: అందుతున్న ద్రాక్షను రోజూ తినడం వల్ల ఈ వ్యాధులన్ని దూరం!