Human Trafficking: రోహింగ్యా మహిళల అక్రమ రవాణా.. ముగ్గురిపై ఛార్జిషీట్ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో మయన్మార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాల్లో ఉంటున్న రోహింగ్యా యువతులను, విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపింది. By B Aravind 04 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది. తాజాగా మయన్మార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు మౌంగ్‌డా జిల్లాకు చెందిన రబీయుల్ ఇస్లాం, సోఫి అలోమ్, మహ్మద్ ఉస్మాన్‌లుగా గుర్తించింది. Also Read: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే.. డి.రాజా సంచలన వ్యాఖ్యలు ఇక జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. 'ఈ ముఠా సరైన పత్రాలు లేకుండా భారత్‌లో అక్రమంగా ప్రవేశించింది. వీళ్లు ఎక్కువగా బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాల్లో ఉంటున్న రోహింగ్యా యువతులను, విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమ జాతి పురుషులతో పెళ్లి చేయిస్తామని నమ్మించి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, జమ్మూకశ్మీర్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో బలవంతపు పెళ్లిలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు ఈ ముఠా వాడుతున్నవి ఫేక్ ఆధార్ కార్టులు. వాటిని వివిధ సిమ్ కార్డులు కొనేందుకు, అలాగే బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు వినియోగిస్తున్నారని' జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే 2023 నవంబర్ 7న ఎన్‌ఐఏ ఈ కేసు విచారణను ప్రారంభించింది. తాజాగా ముగ్గురిపై ఛార్జిషీటు నమోదుచేయడంతో.. మానవ అక్రమ రవాణా రాకెట్‌ను బయటకు తీసేందుకు ఓ కీలక ముందడుగు వేసింది. Also Read: సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష.. #telugu-news #human-trafficking #mayanmar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి