Kerala: వయనాడ్‌లో మృత్యుఘోష.. 254కు చేరిన మృతుల సంఖ్య కేరళలోని వయనాడ్‌లో మృత్యుఘోష పెరుగుతోంది. అక్కడ జరిగిన ప్రకృతి విలయానికి ఇప్పటికి 254 మంది చనిపోగా..ఇంకా 300 మంది ఆచూకీ దొరకలేదని తెలుస్తోంది. By Manogna alamuru 31 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Waynad Nature Disaster: నాలుగు రోజుల వరకు అదొక ప్రకృతి పర్యాటక ప్రాంతం . కానీ ఇప్పుడు బురద, శిథిలాలు, మృత్యుఘోషతో నిండిపోయింది. కేరళలోని చురల్‌మలలోని సూచిపర జలపాతం, వెల్లొలిప్పర, సీతా సరస్సు లాంటి ప్రాంతాలకు పర్యాటకులు విపరీతంగా వస్తారు. ఇప్పుడు అదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రదేశాలన్నీ విధ్వంసంగా తయారయ్యాయి. దాంతో పాటూ కొంచరియలు విరిగిపడిన సంఘటనలో మృతుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈరోజు ఈ సంఖ్య 254కు చేరుకుంది. దాంతో పాటూ మరో మూడు వందల మంది ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగి పడిన కారణంగా చాలా మంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. చాలా ఇళ్ళు నేల మట్టం అయ్యాయి. మట్టి, రాళ్ళతో భూమంతా కప్పబడిపోయింది. వాటి మధ్య ఏడుపులు, రోదనలతో ప్రజలు తమ వారి కోసం వెతుకులాడుతూ తిరుగుతున్నారు. ఈ దృశ్యాలతో అక్కడి వాతావరణం భయానకంగా, హృదయవిదారకంగా తయారయింది. ప్రకృతి నెలవు.. కేరళలోని చురమల ప్రాంతం ప్రకృతి అందాలకు, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందినది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఒకప్పుడు ఋ ప్రదేశం అందంగా, ఆహ్లాదంగా ఉందంటే నమ్మడం కష్టం అన్నట్టు తయారయింది. ఇంతకాలం కుటుంబాలతో కలిసి ఆనందాలను పంచుకున్న వారు ఇప్పుడు తమ వారి కోసం రోదిస్తూ కనిపిస్తున్నారు. తాము సర్వం కోల్పోయామని..ఏమీ మిగల్లేదని ఆ ప్రాంతానికి చెందిన వృద్ధుడు ఒకరు చెప్పారు. వయనాడ్ మ్యాప్ నుంచి ముండక్కై అనే ప్రాంతం తుడిచి పెట్టుకుపోయిందని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమీ మిగలలేదు. మట్టి, రాళ్లు తప్ప మరేమీ లేదని చెప్పారు. ముండక్కైలో 450 నుంచి 500 ఇళ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో 34-49 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో మహిళలు, చిన్నారులు సహా చాలామంది చనిపోయారు. చిపయిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి తోడు శిథిలాల కింద ఇంకా చాలా మంది ఉండిపోయారు. రాజధాని తిరువనంతపురంలో రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ మరియు పోలీసులు ఇప్పటివరకు వేలాది మందికి పైగా ప్రజలను రక్షించారు. దీంతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం కూడా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. దీంతో పాటు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నిన్న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించి సహాయక శిబిరాల్లో ఉన్న బాధితులను పరామర్శించారు. మరోవైపు కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీని గురించి రాజ్యసభలో కూడా మాట్లాడారు. కేంద్రం తరుఫు నుంచి కూడా రెస్క్యూ బృందాలను పంపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రెస్క్యూ, పునరావాసం కోసం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని..విపత్తు నిర్వహణపై బిల్లును కూడా తీసుకొస్తానని అమిత్ షా సభకు తెలిపారు. ఇక కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు రేపు వయనాడ్‌లో పర్యటించనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇక కేరళకు సహాయం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. సీఎం సిద్ధరామయ్య మంత్రి సంతోష్ లాడ్‌తో కలిపి ఒక బృందాన్ని కేరళకు పంపించారు. ఈ విషాన్ని మంత్రి సంతోష్ స్వయంగా తెలిపారు. కేరళలో చనిపోయిన వారిో ముగ్గురు కర్ణాటకకు చెందిన వారు కూడా ఉన్నారని ఆయన అన్నారు. VIDEO | Wayanad landslides: "First of all, I would like to lend the Karnataka government's support to Kerala; CM Siddaramaiah has sent me here, along with the entire team. The entire Karnataka has a lot of sympathy and we are looking forward to support Kerala. As of now, as per… pic.twitter.com/yyKXnU56N8 — Press Trust of India (@PTI_News) July 31, 2024 Also Read: Kerala: అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పినరయ్ విజయన్ #kerala #died #landslides #waynad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి