Uttam Kumar Reddy: కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన మంత్రి ఉత్తమ్

TG: త్వరలో బీఆర్‌ఎస్‌ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌​లో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్. బీఆర్​ఎస్‌కు 15 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు.

New Update
Ration Cards : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి!

Minister Uttam Kumar Reddy: పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అవుతాయని, తెలంగాణలో ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ గెలవదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఉత్తమ్‌. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ వద్దకు వస్తారని కేసీఆర్ చెప్పడం కామెడీగా ఉందన్నారు.

ALSO READ: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ కీలక నేత.. క్లారిటీ!

త్వరలో బీఆర్‌ఎస్‌ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌​లో చేరతారని ఉత్తమ్‌ తెలిపారు. బీఆర్​ఎస్‌కు 15 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు. ఆ పార్టీ గురించి మాట్లాడడం వేస్ట్ అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.

బీజేపీతో తెలంగాణకు నష్టం

బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసేందేమీ లేదని, గత పదేళ్లలో మతతత్వ రాజకీయం చేసి మతాల మధ్య చిచ్చుపెడుతోందని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్యలో జరుగుతాయని అన్నారు. మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రైతుల పంటకు మద్దతు ధర కల్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. ఓట్లను అడిగే హక్కు బీజేపీకి లేదని మండిపడ్డారు. ఇండియా కూటమిలో రాహుల్​ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడుతోందని మండిపడ్డారు. బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, అప్పుల పాలు చేసిందని విమర్శించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mudragada Padmanabham: జగన్ కు ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా జగన్ నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ముద్రగడ జగన్ కు లేఖ రాశారు. PACలో చోటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు త్రికణశుద్ధిగా పని చేస్తానన్నారు.

New Update
Mudragada Padmanabham YS Jagan

Mudragada Padmanabham YS Jagan

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ మాజీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు త్రికరణశుద్ధిగా కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. పేదవారికి మీరే ఆక్సిజన్ అంటూ కొనియాడారు. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పది కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. 

Also Read :  ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ సంచలన వీడియో!

Also Read :  సజ్జలే నంబర్-2.. ఆయన చెప్పిందే ఫైనల్.. జగన్ సంచలన నిర్ణయం!

Mudragada Padmanabham Letter To YS Jagan

Also Read :  తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

Also Read :  రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !

 

mudragada padmanabham | ys-jagan | andhra-pradesh-news | andhra-pradesh-politics | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment