BREAKING : 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేసిన ఏపీ హైకోర్టు!

2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్‌ వాల్యుయేషన్‌పై పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను తిరిగి 6 నెలల్లో నిర్వహించాలని ఏపీ హైకోర్టు చెప్పింది.

New Update
BREAKING : 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేసిన ఏపీ హైకోర్టు!

2018 లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌(Group-1 Mains) ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్‌ వాల్యుయేషన్‌(Digital Valuation) పై పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టు(AP High Court) ను ఆశ్రయించారు. ఈ పరీక్షను తిరిగి 6 నెలల్లో నిర్వహించాలని ఏపీ హైకోర్టు చెప్పింది.

జులై 22, 2022లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను ప్రకటించింది. అయితే ఆ తర్వాత డిజిటల్‌ వాల్యుయేషన్‌పై ఏపీ హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌ వేశారు. దీంతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను నిలిపివేశారు. జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనానికి తిరిగి రావాలని APPSCని కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ పరీక్షను రద్దు చేసిన ఏపీ హైకోర్టు మరో 6 నెలల్లో ఎగ్జామ్‌ పెట్టాలని చెప్పింది.

గ్రూప్‌-1 షురూ:
మరోవైపు ఈ ఏడాది జరగనున్న గ్రూప్‌-1 ఎగ్జామ్స్‌కు సర్వం సిద్ధమైంది. APPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను మార్చి 17న జరగనుంది. ఆఫ్‌లైన్ పరీక్ష పేపర్ 1 (ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు), పేపర్ 2 (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు) రెండు షిఫ్టులలో జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులవుతారు. మొత్తం 81 పోస్టుల కోసం ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

అడ్మిట్ కార్డ్ 2024ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

స్టెప్ 1: ముందుగా APPSC అధికారిక పోర్టల్‌ psc.ap.gov.in ని విజిట్ చేయండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో APPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్-2024 డౌన్‌లోడ్ లింక్‌ను సెర్చ్ చేయండి.

స్టెప్ 3: లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4: రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను పూరించండి.

స్టెప్ 5: లాగిన్ ఆధారాలను సమర్పించండి

స్టెప్ 6: APPSC హాల్ టిక్కెట్ 2024 స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.

స్టెప్ 7: భవిష్యత్తు సూచన కోసం హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్(Download Hall Ticket) చేసి ప్రింటవుట్ తీసుకోండి.

Also Read: ఐటీడీసీలో ఉద్యోగాలు..6 లక్షల వరకు జీతం

Advertisment
Advertisment
తాజా కథనాలు