Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి..

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షోర్‌గంజ్ అనే జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును సరకు రవాణా రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులను పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫైర్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు.

New Update
Vizianagaram train accident:విజయనగరం రైలు ప్రమాదం-ఈరోజు కూడా పలు రైళ్ళు రద్దు

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కిషోర్‌గంజ్ అనే జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును సరకు రవాణా రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులను పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కిషోర్‌గంజ్‌లోని భైరబ్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 3.30 PM గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాకు వెళ్తున్న ఎగరో సింధూర్ అనే ఎక్స్‌ప్రెస్‌ను ఛటోగ్రామ్ వైపు వెళ్తున్న మరో సరకు రవాణా రైలు వెనక నుంచి ఢీకొట్టిందని భైరబ్ రైల్వే పోలీసులు తెలిపారు.


అయితే ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 20 మృతదేహాలను బయటికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫైర్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ఈ దుర్ఘటనలో ధ్వంసమైనటువంటి కోచ్‌లల కొంతమంది ప్రయాణికులు ఇరుక్కుపోయినట్లు ఢాకాకు చెందిన పలు వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ధ్వంసమైన రైలు కోచ్‌లను తొలగించేందుకు క్రేన్లను తరలించారు అధికారులు.

Also Read: జైల్లో నవరాత్రి ఉత్సవాలు.. దాండియా ఆడిన మహిళా ఖైదీలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు