Monkey fever: మంకీ ఫీవర్‌ కలకలం.. ఆ రాష్ట్రంలో ఇద్దరు మృతి

కర్ణాటకలో ఇద్దరు మంకీ ఫీవర్ బారినపడి మృతి చెందడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ ఇన్‌ఫెక్షన్‌ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

New Update
Monkey fever: మంకీ ఫీవర్‌ కలకలం.. ఆ రాష్ట్రంలో ఇద్దరు మృతి

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మంకీ ఫివర్‌ ప్రభావంతో ఇద్దరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 8న శివమొగ్గ జిల్లాలోని హొసనగర అనే ప్రాంతానికి చెందిన యువతి (18) మృతిచెందగా.. తాజాగా ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు (79) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణంచారు.

Also read: ఆ రోజున భారత బలగాలు మాల్దీవులను వదిలి వెళ్తాయి: మయిజ్జూ

49 మందికి మంకీ ఫీవర్

ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, అలాగే చిక్కమగళూరులో 3 కేసులు నమోదైనట్లు కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ రణ్‌దీప్ తెలిపారు. ప్రస్తుతం శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఇదిలాఉండగా.. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా మొత్తం 2,288 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించారు. ఇందులో మొత్తం 49 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

మంకీ ఫీవర్ ఎలా వస్తుంది

కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనుషులను కుడితే.. ఈ వ్యాధి సోకుతుందని రణదీప్ తెలిపారు. మంకీ ఫీవర్‌ వచ్చినప్పుడు.. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. అయిత ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక దశలో ఉన్నప్పుడే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

Also read: పూనమ్ పాండే ప్రకటనకు మాదే బాధ్యత…స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ

Advertisment
Advertisment
తాజా కథనాలు