/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-60.jpg)
Car Accident: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర కారు యాక్సిడెంట్ జరిగింది. 17 ఏళ్ల బాలుడు కారుతో స్టంట్స్ చేస్తూ తల్లీ కూతుళ్లను చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్కూల్‌కు డుమ్మా కొట్టిన బాలుడు తన స్నేహితులతో కలిసి కాన్పూర్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై కారుతో స్టంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన కుమార్తెతో స్కూటీపై వస్తుండగా కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో తల్లీకుమార్తెలిద్దరూ గాల్లోకి ఎగిరి పడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
కారుతో స్కూటీని ఢీకొట్టిన మైనర్లు.. తల్లి మృతి
యూపీ - కాన్పూర్‌లో స్కూటీపై కుమార్తె(12)తో వస్తున్న భావనా (30)ను వేగంగా కారు ఢీకొట్టడంతో ఆమె మృతిచెందగా.. కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి.
నిందితుడు 12వ తరగతి విద్యార్థి కాగా.. మరో అబ్బాయి, ఇద్దరు మైనర్ అమ్మాయిలు కూడా కారులో ఉన్నారు pic.twitter.com/WbamLDnTGF
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2024
బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బాలుడిని, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.