Maharashtra: ఆన్ లైన్ గేమ్ ఎఫెక్ట్..ముందే స్కెచ్ గీసుకుని ప్రాణం తీసుకున్న బాలుడు మొబైల్ ఫోన్స్.. ఆన్ లైన్ గేమ్స్ మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. రీల్స్ పిచ్చితో కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే..మరి కొంత మంది ఆన్ లైన్ గేమ్స్ మోజులో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలో జరిగింది. వివరాలు కింద చదివేయండి.. By Manogna alamuru 02 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Pre Planned Sketch For suicide: టెక్నాలజీ, మొబైల్స్, గాడ్జెట్స్..కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కొంతమంది పిల్లలు మొబైల్స్‌లోని ఆన్‌లైన్ గేమ్స్ పట్ల ఎంతగా అడిక్ట్ అయిపోతున్నారంటే.. ప్రాణాలను తీసుకునే వరకు వెళ్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ వ్యసనంతో బంగారం లాంటి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వాటి మోజులో పడి తమ జీవితాలను అంతం చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ బాలుడు ఆన్లైన్ గేమ్స్ వ్యసనానికి బానిపై.. ప్రాణాలు తీసుకున్నాడు. ముందే ఎలా దూకాలో కూడా స్కెచ్ గీసుకోని మరి.. బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు తాముంటున్న భవనం 14వ అంతస్తు నుండి దూకి మరణించాడు. అతను ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస కావడం ఈ విషాద సంఘటనకు దారితీసిందని ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. అయితే రావెట్ పోలీస్ స్టేషన్‌లో మాత్రం ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందాడని కేసు నమోదైంది. ఆ తర్వాత కేస్ స్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూణేలో 10వ తరగతి చదువుతున్న బాలుడు.. చదువులో బాగా రాణిస్తున్నాడు. అతను తన తల్లితో కలిసి కివాలేలోని రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్నాడు. అక్కడే అతను తన ఉంటున్న ఇంటి పైన 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు తన ల్యాప్‌టాప్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలుడి గదిలో పోలీసులు రెండు స్కెచ్‌లు, ఒక నోట్‌ను కనుగొన్నారు. “లాగ్ అవుట్ నోట్” పేరుతో ఉన్న నోట్‌లో మల్టీప్లేయర్ కంబాట్ గేమ్ కోసం స్ట్రాటజీ మ్యాప్ ఉంది. అదనంగా, అతని నోట్‌బుక్‌లో అనేక ఇతర స్కెచ్‌లు.. మ్యాప్‌లు కనుగొన్నారు. స్కెచ్‌లలో ఒకటి అతని గదిని, బాల్కనీలో “జంప్”తో ఉన్న భవనాన్ని చూపించింది.. అది అతను దూకిన ప్రదేశం..“బాలుడు ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడని అతని కుటుంబ సభ్యులు మాకు తెలియజేసారు. మేము అతని ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాము. అతని కుటుంబ సభ్యులకు పాస్‌వర్డ్ తెలియకపోవడంతో మేము దానిని ఇంకా తెరవలేదు” అని పింప్రి చించ్వాడ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ స్వప్నా గోర్ చెప్పారు. Also Read:Wayanad: ప్రకృతి ప్రకోపానికి ముందు…తర్వాత..ఇస్రో వాయనాడ్ శాటిలైట్ పిక్స్ #suicide #maharstra #15years-boy #mobile-games మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి