Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి..!

కర్ణాటకలోని హవేరిలో ముందు వెళ్తున్న లారీని ఓ టెంపో వెనుక నుంచి అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా సవదత్తిలోని ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్నారు.

New Update
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి..!

Karnataka : దైవదర్శనానికి వెళ్లి వస్తున్న టెంపో ప్రమాదానికి (Tempo Accident) గురవ్వడంతో అందులోని 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని హవేరిలోఈ ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఓ టెంపో వెనుక నుంచి అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వీరంతా సవదత్తిలోని ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలోనే బైడగి (Byadgi) తాలుకాలోని గుండేనహళ్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను (Dead Bodies) స్వాధీనం చేసుకున్నారు.

Also read: భారీ వర్షాలకు కూలిన ఎయిర్‌ పోర్ట్‌ రూఫ్‌..ముగ్గురికి తీవ్ర గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: రైస్ మిల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి!

ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు. మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు.

New Update
rice mill

East Godavari rice mill lectric shock issue

AP Crime: ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు.

ట్రాలీలో రైస్ తీసుకొస్తుండగా..

ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ వెనక రైస్ మిల్ లోకి శనివారం ఉదయం గోడౌన్ నుండి రైస్ ను ట్రాలిలో రైస్ తీసుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతులు ఆకుల శ్రీరాములు (34), పలసాని అన్నవరం (55),జాజుల వెంకన్న (46) చనిపోయారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి రైస్ మిల్ యజమాన్యంపై, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ  తెలిపారు.

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం పైన, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మార్చుకోవాలని, విద్యుత్ అధికారులు వైర్లు కిందకు ఉన్నా పట్టించుకోకపోవడం తో ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు తమముందు కన్నీటి పర్యాంతమయ్యారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫునుంచి ఆదుకోవాలని, వైసీపీ తరఫునుంచి కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారిని ఆదుకుంటామని  మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఇలాంటి ఘటన మళ్లీ పునరవృతం కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

 rice | power | shock | today telugu news

Advertisment
Advertisment
Advertisment