TS 10th Results: పదవ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.

New Update
TS 10th Results: పదవ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్

Telangana SSC Results 2024: తెలంగాణ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ https://results.bsetelangana.org/ https://bse.telangana.gov.in/లో చూసుకోవచ్చు.

ఈ ఫ‌లితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానంలో నిల‌వ‌గా.. 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివ‌రి స్థానానికి వెళ్లిపోయింది. బాలిక‌లు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత కాగా.. ఆరు పాఠశాలలో సున్నా ఉత్తీర్ణత శాతం న‌మోదైంది. గ‌తేడాది 89.60 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా.. ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది.

ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదే తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీళ్లలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పేపర్ కరెక్షన్‌ ప్రక్రియ ఏప్రిల్ 13 నాటికి పూర్తయింది. ఇదిలాఉండగా ఇటీవలే రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

Also Read: టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. హైదరాబాద్-విజయవాడ రూట్ ప్రయాణికులకు భారీ ఆఫర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు