Telangana: పార్లమెంటు ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రూ.104 కోట్లు స్వాధీనం

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.104.18 కోట్లు దొరికాయి. నగదు, మద్యం, ఆభరణాలు, విలువైన వస్తువులను ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.

New Update
Telangana: పార్లమెంటు ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రూ.104 కోట్లు స్వాధీనం

పార్లమెంటు ఎన్నికలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, లిక్కర్, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.104.18 కోట్లు దొరికాయి. రాష్ట్రంలో 477 ఎఫ్‌ఎస్‌టీ, 464 ఎస్‌ఎస్‌టీ బృందాలు మొత్తం 89 సరిహద్దు చెక్‌పోస్టుల్లో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్‌తో పాటు ఆభరణాలు, విలువైన వస్తువును స్వాధీనం చేసుకున్నాయి.

Also Read: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నిక.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఇందులో రూ.63.18 కోట్ల నగదు, రూ.5.38 కోట్ల విలువైన మద్యం, రూ.7.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. అలాగే రూ.21.34 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.6.91 కోట్ల విలువైన ఇతర వస్తువులను కూడా ఈ ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాదు 7,174 లైసెన్స్‌డ్‌ ఆయుధాలను కూడా పోలీసులకు డిపాజిట్ చేసి.. అనధికరికంగా వెంటబెట్టుకున్న 14 ఆయుధాలను సీజ్ చేశాయి. డిటోనేటర్లు, కార్టన్‌ బాక్స్‌, జిలిటెన్‌స్టిక్స్‌ వంటి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో రూ.100కోట్లకు పైగా పట్టుబడటం చర్చనీయాంశమవుతోంది.

Also Read: కండోమ్స్ ఎక్కువగా వాడేది ముస్లింలే.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు