Sandeshkhali : సందేశ్‌ఖాలీ ఘటన.. దీదీ సర్కార్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల తీవ్ర దుమారం రేపిన సందేశ్‌ఖాలీ ఘటనపై కలకత్తా హైకోర్టు.. మమతా బెనర్జీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల భద్రతకు సంబంధించిన ఏదైనా ముప్పు ఏర్పడితే అది 100 శాతం ప్రభుత్వం బాధ్యతనేనని తేల్చి చెప్పింది.

New Update
Sandeshkhali : సందేశ్‌ఖాలీ ఘటన.. దీదీ సర్కార్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Didi Sarkar : ఇటీవల పశ్చిమ బెంగాల్‌(West Bengal) లో సందేశ్‌ఖాలీ(Sandeshkhali) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అధికార తృణమూల్ కాంగ్రెస్(Congress) పార్టీకి చెందిన షాజహాన్ షేక్, అతడి సహచరులు.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం, వాళ్ల భూములను బలవంతంగా లాక్కొన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు(Calcutta High Court) లో చాలామంది పిటిషన్లు వేశారు. అయితే తాజాగా ఆ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల భద్రతకు సంబంధించిన ఏదైనా ముప్పు ఏర్పడితే అది 100 శాతం ప్రభుత్వం బాధ్యతనేనని తేల్చి చెప్పింది.

Also Read : ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ పట్టివేత

అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా.. ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక్క శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటని.. అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం దీనికి పూర్తి బాధ్యత వహించాలి అంటూ ఘాటుగా స్పందించింది. మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు.. షాజహాన్ షేక్‌ కొన్నిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చివరికి ఫిబ్రవరిలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే ఏకంగా 55 రోజుల పాటు షాజహాన్ పరారీలో ఉండటంపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కేసు తీర్పును రిజర్వు చేసింది.

ఇదిలాఉండగా.. షాజహాన్ అకృత్యాలను ఎదురెళ్లి నిలిచిన రేఖా పత్రా అనే మహిళ.. అక్కడ మహిళలు చేపట్టిన నిరసనకు నాయకత్వం వహించారు. అంతేకాదు షాజహాన్ అనుచరుల బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆమెకు బీజేపీ.. బసిర్‌హట్‌ స్థానం నుంచి టికెట్ ఇచ్చింది.

Also Read: ఆ గ్రామంలోకి ఏం టచ్ చేసినా జేబుకు చిల్లే.. భారతీయ చట్టాలను పట్టించుకోని ఊరు!

Advertisment
Advertisment
తాజా కథనాలు