హైదరాబాద్‌లో త్వరలో 100 ఫీట్ల ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను టీడీపీ ఏడాది పాటు నిర్వహించింది. ఇప్పుడు మరో పెద్ద కార్యక్రమంతో దానిని ముగించాలని సంకల్పించింది. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ 100 ఫీట్ల విగ్రహం ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధిచిన వివరాలను టీడీపీ నేత టీడీ జనార్థన్ వివరించారు By Karthik 31 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఏడాది పాటు ఘనంగా నిర్వహించామని టీడీపీ నేత టీడీ జనార్థన్ తెలిపారు. ఆర్టీవీతో మాట్లాడిన ఆయన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరి కొన్ని కోజుల్లో ఎన్టీఆర్‌కు గుర్తుగా హైదరాబాద్ నగరంలో 100 ఫీట్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తెలుగు వారు అందరూ ఏకం కావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారన్నారు. టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని గుర్తు చేశారు. ఆ మహానుభావుడు చేసిన సేవలకు ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు.ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ నగరంలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలుగు ప్రజలకు అంకితమిస్తామని ఆయన స్పష్టం చేశారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా తయారు చేస్తామని.. విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన వారు అక్కడ రెండు రోజులు గడిపేందుకు వీలుగా నిర్మాణాలు చేపడతామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయబోయే ప్రాంతం ఛార్మినార్ మాదిరిగా ప్రఖ్యతి గాంచిన ప్రదేశంగా ఈ విగ్రహం మారుతుందన్నారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న యువకుల్లో అధిక శాతం మంది ఎన్టీఆర్‌ను చూసుండరని, వారికి అన్నగారి గురించి, ఆయన ఎదిగిన తీరు గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీని కోసం నందమూరి తారకరామారావుకుసంబంధంచిన ఫైళ్లను భద్రపరిచి విగ్రహం దగ్గరే లైబ్రరీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దీని కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతీ టీడీపీ కార్యకర్తలు ముందుకు వస్తున్నారని, వారందరి సహకారంతో హైదరాబాద్‌లో 100 ఫీట్ల విగ్రహాన్ని ఏర్పటు చేయబోతున్నట్లు టీడీ జనార్థన్ పేర్కొన్నారు. #hyderabad #ntr #statue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి