10 Years Telangana : కామన్ అడ్మిషన్లకు కాలం చెల్లు.. ఏపీ కోటాకు బ్రేక్!

ఈ జూన్ 2నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కానుంది. దీంతో ఏపీ విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్లు కల్పించే కామన్ అడ్మిషన్ల గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగియనుంది. మొత్తం సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి.

New Update
10 Years Telangana : కామన్ అడ్మిషన్లకు కాలం చెల్లు.. ఏపీ కోటాకు బ్రేక్!

Telangana : ఈ జూన్ 2నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నీటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం..
ఈ మేరకు మే 18వ తేదీన శనివారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) నిర్వహించనున్నారు. ఏపీ(AP) పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీతో కొలిక్కి రాని వివాదాలు, రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల సాగు ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్న షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిల విషయం ఇంకా తేలలేదు. వీటిపై పేచీలు కొనసాగుతున్నాయి.

కామన్ అడ్మిషన్లకు ముగింపు..
ఇదిలా ఉంటే.. ఏపీ విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్లు కల్పించే కామన్ అడ్మిషన్ల(Common Admissions) గడువు ఈ విద్యా సంవత్సరం(Academic Year) తో ముగియనుంది. పదేండ్ల గడువు విధించగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ కోటా అడ్మిషన్లకు బ్రేక్ పడనుంది. మొత్తం సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఫ్రొఫెషనల్ కోర్సుల్లో ఉమ్మడి అడ్మిషన్లకు పదేండ్ల గడువు విధించారు. దీంతో ఎంసెట్, ఐసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్, ఈసెట్, పీఈసెట్ వంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కన్వీనర్ కోటాలోని ఓపెన్ కోటా సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీపడే అవకశం కల్పించారు. ఇందుకు ప్రభుత్వం 2014లో జీవోను జారీ చేయగా జూన్ 2తో గడువు ముగియనుంది. తెలంగాణలో ఇప్పటికే అన్నిరకాల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈసెట్, ఎప్ సెట్ ఎగ్జామ్స్ ముగియగా ఐసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలు జరగాల్సివుంది. వాస్తవానికి ఉమ్మడి అడ్మిషన్ల గడువు నిరుడితోనే ముగియాల్సి ఉంది. కానీ జూన్ నుంచి జూన్ వరకూ విద్యాసంవత్సరం ఉంటుంది. 2024-25లో నోటిఫికేషన్లు అన్నీ జూన్ కు ముందే విడుదలకావడంతో ఈ యేడాది సాంకేతికంగా అవకాశం లభించింది.

ఇక ఈ సంవత్సరం ఎప్ సెట్ సహా పలు ప్రవేశపరీక్షలకు ఏపీ విద్యార్థులనుంచి భారీ స్పందన వచ్చింది. చివరి ఏడాది కావడంతో పోటీపడి దరఖాస్తులు సమర్పించారు. ఈ ఏడాది ఎప్ సెట్ కు 3.5 లక్షలు అప్లికేషన్స్ వచ్చాయి. 2023లో 72 వేల మంది ఏపీకి చెందినవారు దరఖాస్తు చేయగా.. 2022లో 36వేలకు పైగా దరఖాస్తు చేశారు.

Also Read : తెలంగాణలో భూముల ధరలు పెంపు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు