తెలంగాణలో ఇప్పటివరకూ ఎంత పోలింగ్ శాతం నమోదయ్యిందంటే?

New Update
తెలంగాణలో ఇప్పటివరకూ ఎంత పోలింగ్ శాతం నమోదయ్యిందంటే?

తెలంగాణ అంతటా వాతావరణం సందడిగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తో అన్ని జిల్లాలూ హడావుడిగా ఉన్నాయి. ఉదయం ఏడు నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర జనాలు క్యూలు కట్టారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులూ, ఇతర అధికారులు కూడా ఓట్లు వేయడానికి తరలివస్తున్నారు. ఇప్పటికి పోలింగ్ మొదలై మూడు గంటలు గడిచింది. ఇప్పటివరకు తెలంగాణ మొత్తం కలిపి 20% ఓటింగ్ నమోదయ్యింది. అత్యధికంగా అదిలాబాద్ జిల్లాలో  30.3 శాతం నమోదయితే అత్యల్పంగా హైదరాబాద్ లో 12.39 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది.

Also read:ఓటు వేయడానికి తరలివస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు

పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎప్పటిలానే ఓటు వేయడానికి జనాలు వెళ్ళడం లేదు. హైదరాబాద్ లో రాను రాను పోలింగ్ తగ్గుతోంది. ఎన్నికల రోజును ప్రభుత్వం పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి. అయినా ఓటు వేయడానికి జనాలు బద్ధకిస్తున్నారు. హాలీడే వచ్చిందని సొంత పనులు చేసుకుంటున్నారు. ఓటు ప్రాధాన్యతను గుర్తించలేకపోతున్నారు. సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. ప్రజలు వేయడం లేదు. ప్రతీసారి పోలింగ్ లో హైదరాబాద్ లో ఓటింగ్ శాతం మిగతా అన్ని చోట్ల కంటే తక్కువే ఉంటుంది. ఇప్పటివరకూ లెక్కలు చూస్తూ ఈసారికూడా అదే రిపీట్ అయ్యేట్టు కనిపిస్తోంది.

మరోవైపు పోలింగ్ కేంద్రాల దగ్గర అప్పుడే గొడవలు మొదలయ్యాయి. సూర్యాపేట మరో రెండు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు సంభవించాయి. పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఇక మరికొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గరకు సెల ఫోన్లు పట్టుకురావడంతో వారిని వెనక్కి తిరిగి పంపించేశారు. చాలా స్ట్రిక్ట్ గా పోలింగ్ బూత్‌ల దగ్గరకు ఫోన్లను పట్టుకెళ్ళనీయకుండా చూస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు