Tamil Nadu: బాణాసంచా తయారీ కార్మాగారంలో పేలుడు.. 10 మంది మృతి..

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో ఓ బాణాసంచా తయారీ కార్మాగరంలో పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మానవతప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

New Update
Tamil Nadu: బాణాసంచా తయారీ కార్మాగారంలో పేలుడు.. 10 మంది మృతి..

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా రముతెవన్‌పట్టిలో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచాల తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. శనివారం రోజున ఎప్పట్లాగే ఫ్యాక్టరీకి వచ్చిన కార్మికులు బాణాసంచాలు తయారు చేసేందుకు రసాయనలు కలపుతున్న సమయంలో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Also read: రాహుల్- ప్రియాంక మధ్య గొడవలు.. అందుకే రాలేదు: బీజేపీ

రసాయనాలను మిశ్రమం చేసే గది లోపల ఈ ప్రమాదం జరిగడంతోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం రసాయనాలకు కలిపేటప్పుడు ఆ గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలని.. పేర్కొన్నారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఆ గది లోపల లేదా దాని బయటే 8 మంది ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిందని చెప్పారు. అలాగే ఈ బాణాసంచా తయారీ కార్మాగారం యజమాని, మేనేజర్‌లపై కేసు నమోదైందని.. నిందితుల్ని పట్టుకునేందుకు తాము ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు. అలాగే ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేలా ఆదేశాలిచ్చామని స్పష్టం చేశారు.

మరోవైపు ఈ దుర్ఘటనపై స్పందించిన తమిళనాడు సీఎం స్టాలిన్.. మృతులకు సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఇదిలాఉండగా.. తమిళనాడులోని విరుదునగర్‌, శివకాశీలో మానవ తప్పిదం, నిర్లక్ష్యం వల్లే బాణాసంచా తయారీ కర్మాగారాలు పేలిపోతున్న ఘటనలు తరచుగా జరగుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న బాణాసంచాలు తయారు చేసే 1000 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశంలోని మార్కెట్‌లోకి వచ్చే 90 శాతం బాణాసంచాలు కూడా ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి.

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆ రోజే కోర్టుకు వస్తా: కేజ్రీవాల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు