Jammu-kashmir: కథువాలో ఎన్‌కౌంటర్..ఒక ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఒక ఉగ్రవాది మరణించారు. రెండు రోజుల తేడాలో జమ్మూ కాశ్మీర్‌లో రెండు ఉగ్రదాడులు జరిగాయి.

New Update
Jammu-kashmir: కథువాలో ఎన్‌కౌంటర్..ఒక ఉగ్రవాది హతం

Terror Attack :కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లో కథువాలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అక్కడి అంతర్జాతీయ సరిహద్దుకి దగ్గరలో హీరానగర్ సెక్టార్‌లోని కథువాలో సైదా గ్రామంలో ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ముందుగా వీరిని గుర్తించిన గ్రామస్తులు అధికారులను అప్రమత్తం చేశారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతాదళాలు వెంటనే గ్రామానికి చేరుకుని ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ముష్కరులు దగ్గరలోని అడవుల్లోకి పారిపోయేందుకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు, బీఎస్ఎఫ్ అనుమానిత వ్యక్తుల కోసం జాయింట్ ఆపరేషన్ ప్రారంభించింది.

ఇక జమ్మూ కాశ్మీర్‌లో రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో ఉగ్రదాడి. ఆదివారం రియాసీ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఈ దాడి వెనక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. రెండు రోజులుగా ఉగ్రవాదుల్ని గుర్తించేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. రాన్సో-పోనీ-ట్రియాత్ బెల్ట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను మోహరించారు. పారిపోతున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పోలీస్, ఆర్మీ, సీఆర్పీఎఫ్‌కి చెందిన 11 టీములు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి.

Also Read:India Army: భారత కొత్త ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది

Advertisment
Advertisment
తాజా కథనాలు