TS Politics: కేటీఆర్ కుట్రతో నా సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్.. రాణి రుద్రమ సంచలన ఆరోపణలు By Nikhil 31 Oct 2023 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి (RaniRudrama Reddy) సంచలన ఆరోపణలు చేశారు. తన ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యిందని ఆరోపించారు. హ్యాకింగ్ చేయడం అధికార బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా ఖాతాలను బీఆర్ఎస్ పార్టీ హ్యాక్ చేయిస్తోందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: Telangana Elections 2023 : కొల్లాపూర్ పర్యటనలో మార్పు.. ప్రియాంక స్థానంలో రాహుల్..!! My Facebook page named as RaniRudrama Reddy has been hacked In fear of losing election in Sircilla, coward @KTRBRS stooping too low and resorting to cheap tactics. Mr @KTRBRS you may hack my Facebook page but you can't suppress my voice. There will be hundreds of my well… — Rani Rudhrama Reddy (@RaniRudrama) October 31, 2023 తన ఫేస్ బుక్ పేజీలో అసభ్యకర పోస్టులు వస్తున్నాయన్నారు. సిరిసిల్లలో జరుగుతున్న అక్రమాలు బయటకు రాకుండా కేటీఆరే తన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు.ఫేస్ బుక్, ఇన్స్టా అకౌంట్స్ డెలీట్ చేసినంత మాత్రాన బీజేపీ విజయం ఆపలేరన్నారు. సిరిసిల్ల ప్రజలు బీజేపీ వైపుకు ఉన్నారని.. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. రాణి రుద్రమను మంత్రి కేటీఆర్ పై సిరిసిల్లలో బరిలోకి దించింది బీజేపీ. దీంతో అక్కడ ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్థానిక బీజేపీ నేతలు వేరే జిల్లాకు చెందిన రాణి రుద్రమకు ఇక్కడ ఎలా టికెట్ ఇస్తారంటూ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు #bjp #telangana-elections-2023 #telangana-bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి