తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తల ప్రత్యేక పూజలు..రేపు నింగిలోకి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్

New Update
తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తల ప్రత్యేక పూజలు..రేపు నింగిలోకి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్

Special pooja for ISRO scientists in Tirumala LVM3P4 rocket will land tomorrow

మూలవిరాట్ పాదాల వద్ద రాకెట్ నమూనాను

ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమలకు విచ్చేసి.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల14వ తేదీన లాంచ్ చేయనున్న పీఎస్‌ఎల్వీ-సీ 52 ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ నమూనాను మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శాస్త్రవేత్తలకు స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందించారు. ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని, రాకెట్ నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అదే పాటిస్తూ.. ఈసారి కూడా పూజలు నిర్వహించారు. శ్రీహరికోట నుంచి రేపు ఉదయం 5 గంటల 59 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ-సీ 52 నింగిలోకి దూసుకెళ్లనుంది.

Special pooja for ISRO scientists in Tirumala LVM3P4 rocket will land tomorrow

చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం

శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లో ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో అధిపతి డా. సోమనాథ్ షార్‌కు చేరుకున్నారు. భాస్కరా అతిథి భవనంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో చంద్రయాన్-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తువేల్, ఎల్‌వీఎం-3పీ4 మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన్‌కుమార్, అసోసియేట్ మిషన్ డైరెక్టర్ నారాయణ్, వెహికిల్ డైరెక్టర్ బిజూస్ థామస్ పాల్గొన్నారు.

ప్రయోగంలో మూడు మాడ్యూల్స్‌

కాగా, ప్రయోగంలో మూడు మాడ్యూల్స్‌ను సిద్ధం చేశారు. (ప్రొపల్షన్‌ మాడ్యూల్‌) ఈ రాకెట్‌ను నింగిలోకి తీసుకుపోయే మాడ్యూల్‌ ఇది. ఈ మాడ్యూల్‌.. రాకెట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి వేరుపడిపోతుంది. రెండోవది (ల్యాండర్‌ మాడ్యూల్‌) చంద్రుడిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించేది ఇదే. రాకెట్‌ నుంచి విడిపోయిన తర్వాత నిర్ణీత సుదూర కక్ష్యకు చేరుకొని చంద్రుడివైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి చేరుకొంటుంది. దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్‌ దిగగానే రోవర్‌ బయటకు వస్తుంది. ఇక మూడోది (రోవర్‌) చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరమే రోవర్‌. ఇది చందమామపై ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ రోవర్‌ జీవితకాలం 14 రోజులు. రంభ-ఎల్పీ, సీహెచ్‌ఏఎస్టీ ఈ పరికరాలు వాతావరణంలో ప్లాస్మా ఆయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతను, నీటి జాడలను సీహెచ్‌ఏఎస్టీ ఈ గుర్తిస్తుంది.

Special pooja for ISRO scientists in Tirumala LVM3P4 rocket will land tomorrow

40 రోజుల జర్నీ

అయితే దీని ప్రయాణం 40 రోజుల తర్వాత చంద్రయాన్‌-3 చంద్రుడిని చేరుకొంటుంది. రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్‌ భూమి చూట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. అత్యంత సమీపంగా 170 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 36 వేల 500 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అప్పుడు భూ కక్ష్యను వదిలి చంద్రుడివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. చంద్రుడిని చేరుకొనేందుకు 40 రోజులు పడుతుంది. దీనికి అతి తక్కువ ఇంధనమే అవసరం పడుతుంది. దీంతో ప్రయోగం ఖర్చు కూడా చాలా తగ్గుతుందని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు