కాంగ్రెస్ కు మాజీ మంత్రి షాక్?

New Update
కాంగ్రెస్ కు మాజీ మంత్రి షాక్?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2009 వరకు ఓ వెలుగు వెలిగిన నేత సంభాని చంద్రశేఖర్ (Sambani Chendra Shekhar). నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఆయన పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పీసీసీ చీఫ్ అవుతారన్న ప్రచారం కూడా సాగింది. అయితే.. ఆయన ప్రాతినిధ్యం వహించిన పాలేరు నియోజకవర్గం 2009లో ఎస్సీ రిజర్వ్డ్ నుంచి జనరల్ కు మారడంతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆయన సత్తుపల్లికి మకాం మార్చాల్సి వచ్చింది. అక్కడ వరుస ఓటములు ఎదురవడంతో ఈ ఎన్నికల్లో చివరికి టికెట్ దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో భవిష్యత్ కార్యాచరణ కోసం తన ముఖ్య అనుచరులతో ఆయన సమావేశమయ్యారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: కాంగ్రెస్ గెలిస్తే అసలైన 24 గంటల కరెంట్.. ధరణిని మించిన యాప్‌: రేవంత్ రెడ్డి

సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థిత్వం వేరొకరికి దక్కడంపై ఈ సమావేశంలో సంభాని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరముందన్న సంభాని తన అనుచరుల సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల నాడి తెలుసుకోకుండా అధిష్టానం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలకు తగినట్లు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్ హైకమాండ్ తనకు అన్యాయం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సంభాని పార్టీ మారతారా? లేక ఇండింపెండెంట్ గా పోటీ చేస్తారా? అన్న చర్చ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు