/rtv/media/media_files/2025/04/05/IZlt50jNjbovaEaBGvoY.jpg)
Rain Alert
Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.
Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
AP : వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి
వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారనేది ప్రజలందరికీ తెలుసన్నారు. ఈవీఎంలపై అనుమానం ఉండడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.
YV Subba Reddy : వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) పై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుందని వైసీపీ (YCP) రీజనల్ కో-ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారన్నేది ప్రజలందరికి తెలుసు అన్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..సార్వత్రిక ఎన్నికల్లో EVMలపై తమకు మొదటి నుంచి అనుమానం ఉందన్నారు.
Also Read: ‘మా నాన్నను జైల్లో వేయండి’.. ఓ ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు..!
ఈవీఎంలపై గతంలో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అనుమానం వ్యక్తం చేశారని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. 2019లో టీడీపీ ఓటమి తరువాత ఈవీఎంలపై చంద్రబాబు మాట్లాడారన్నారు. ఈ క్రమంలోనే ఈవీఎంలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
Rain Alert: ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?
వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో........Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Pahalgam Terror Attack: కావలి చేరుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం
పెహల్గామ్ లో ఉన్మాద ఉగ్రవాదుల చేతిలో నెల్లూరు జిల్లా కావలి కి చెందిన మధుసూధనరావు హతమయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Vidadala Rajini : మాజీమంత్రికి బిగ్ షాక్....మరిది అరెస్ట్
మాజీ మంత్రి విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Madhusudhan Rao : AK 47గన్ తో కాల్చారు.. మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ నెల్లూరు
BIG BREAKING: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!
తిరుమలలో 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
USA: వీసాల రద్దు ఆపండి..విద్యార్థులకు అమెరికా న్యాయస్థానం ఊరట
🔴Pahalgam Terrorist Attack: పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. ఆ దేశ 'ఎక్స్' అకౌంట్ బ్లాక్..
Coffee Powder: కాఫీ పౌడర్‌తో అవాంఛిత రోమాలు తొలగించవచ్చా?
భార్యల దగ్గర భర్తలు దాచే విషయాలు ఏంటో మీకు తెలుసా?
Pakistan: పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. ఆ దేశ 'ఎక్స్' అకౌంట్ బ్లాక్..