ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై రాజ్ కసిరెడ్డి మరోసారి స్పందించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్ ఆఫీసుకు విచారణకు వస్తానని ప్రకటించారు. ఈ మేరకు సిట్ అధికారులకు తన తండ్రి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆడియో విడుదల చేశారు. ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందన్నారు రాజ్ కసిరెడ్డి. అందుకే సిట్ విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. తొలిసారిగా కసిరెడ్డి సిట్ ముందుకు హాజరు అవుతుండడం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆయన సిట్ అధికారులకు ఏం చెబుతారు? ఎవరి పేర్లు బయట పెడతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
విజయసారి చరిత్ర బయట పెడతా..
ఏపీ లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడు కసిరెడ్డి ఈ నెల 19న సైతం ఓ ఆడియో విడుదల చేశారు. మార్చిలో సిట్ అధికారులు వారి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. తాను లేనప్పుడు తన తల్లికి నోటీసులు ఇచ్చారన్నారు. తనను విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు చప్పారు. ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వమని అడిగానన్నారు. తన ఈ మెయిల్‌కు సెకండ్ నోటీసు ఇచ్చారన్నారు. ఈ విషయంపై తాను తన లాయర్లను సంప్రదించానన్నారు. ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ వేసినట్లు వివరించారు.
సిట్ కు సహకరిస్తా..
సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. విజయసాయి తీరు, చరిత్ర, నిజాలు త్వరలో బయటపెడతానన్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్ట్ లో విచారణ జరిగింది. ప్రభుత్వం నుంచి తాము సూచనలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను వారం పాటు వాయిదా వేసింది న్యాయస్థానం.
(ap liquor scam | telugu-news | telugu breaking news | latest-telugu-news)