Andhra Pradesh : ఇవాళ స్పీకర్ ఎదుట హాజరుకానున్న టీడీపీ-వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ నోటీసులు పంపించారు. మధ్యాహ్నం 12.00 PM గంటలకు వైసీపీ.. 2.45 PM టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని నోటిసుల్లో తెలిపారు. ఎమ్మెల్యేల హాజరుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. By B Aravind 29 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Assembly Elections 2024 : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాజకీయాలు(Politics) రసవత్తరంగా మారుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ పార్టీ(YCP Party) ప్రయత్నిస్తుండగా.. జగన్ సర్కార్(Jagan Sarkar)ను గద్దె దించాలని టీడీపీ-జనసేన(TDP - Janasena) పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను కూడా ప్రకటించేశారు. మరికొన్ని రోజుల్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా రానుంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ నోటీసులు పంపించారు. మధ్యాహ్నం 12.00 PM గంటలకు వైసీపీ.. 2.45 PM టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని నోటిసుల్లో తెలిపారు. Also Read: కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ ఆనం రామనారాయణ రెడ్డి,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. స్పీకర్ ఎదుట హాజరై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వనున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విదేశీ పర్యటనలో ఉండటంతో ఫిబ్రవరి 2 వరకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై రాష్ట్రంలో ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. Also Read: చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంలో నేడు విచారణ #telugu-news #tdp #ap-politics #ysrcp #assembly-elections-2024 #tdp-janasena-alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి